ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని నిరసన తెలియజేస్తూ… ప్రస్తుతం టిడిపి నేతలు సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రిన్స్ మహేష్ బాబు బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తన వంతు నిరసన తెలియజేస్తున్నారు. అదీ గాక తాజాగా సోషల్ మీడియాల వేదికగా వెలిబుచ్చిన ఓ అభిప్రాయం వైరల్ అయ్యింది.
త్వరలో “జగన్ పవన్” అనే కొత్త సినిమా విడుదల కాబోతోందని… దీనికి ప్రశాంత్ కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారని… అలాగే మోడీ-షాల ద్వయం నిర్మిస్తున్నారని… తనదైన శైలిలో సోషల్ మీడియాల మాధ్యమాలలో గల్లా జయదేవ్ పోస్ట్ చేసారు. కావలసినంత ‘ఎటకారం’ ఉన్న ఈ పోస్టింగ్ కు నెటిజన్లు ఫిదా కావడంతో, నెట్టింట హంగామా చేస్తోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT



