పార్టీ కోసం సొంత ఇమేజ్ ని వదిలేసుకున్న తెరాస తాజా మాజీ ఎమ్మెల్యే

gangula kamalakarగంగుల కమలాకర్ ఒకప్పుడు టీడీపీలో ప్రముఖ నేత తరువాతి కాలంలో తెరాసలో జాయిన్ అయ్యి కరీంనగర్ ఎమ్మెల్యే అయ్యారు. అసెంబ్లీ రద్దుతో ప్రస్తుతానికి తాజా మాజీ ఎమ్మెల్యే. అప్పట్లో టీడీపీలో ఉండగా బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చెయ్యడంతో బాబ్లి కేసులో చంద్రబాబుతో పాటు ఆయన కూడా నోటీసు అందుకున్నారు.

[m9ad]

ADVERTISEMENT

అయితే ఈ విషయంలో చంద్రబాబుకు టీడీపీకు మైలేజ్ రాకూడదని ఆయన సొంత ఇమేజ్ ని కూడా త్యాగం చేసినట్టుగా ఉన్నారు. తెలంగాణ ఎన్నికలలో రాజకీయ లబ్ది పొందడానికి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చౌకబాబు ఎత్తుగడలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

తెలుగుదేశం నేతలు దీనిపై హడావుడి చేస్తున్నారని, అయితే వారికి ఒరిగేదేమీ ఉండదని ఆయన అన్నారు.కోర్టు నోటీసును కూడా టిడిపి రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నించడం దురదృష్టం అని ఆయన చెప్పుకొచ్చారు. ఇంతకీ అప్పటి బాబ్లీ పోరాటం చౌకబారు పోరాటమా అనేది కూడా ఆయన చెబితే బావుంటుంది.

ADVERTISEMENT
Latest Stories