జాతీయ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గ ఎంపికైన భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, కోచ్ గ బాధ్యతలు తీసుకున్నాక మొదటి సారి మీడియా ముందుకు వచ్చారు. హెడ్ కోచ్ గంభీర్ తో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేడు ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్ కు హాజరయ్యారు.
ఇక అందరూ అనుకున్నట్టే నేడు గంభీర్ పలు కీలక ప్రకటనలు చేసారు. ఇటీవలే శ్రీలంకతో సిరీస్ ఆడేందుకు జట్టును ప్రకటించగా, ఆ ఎంపిక లో ఎన్నో లోపాలున్నాయి అని, గంభీర్ పక్షపాతం చూపించి, కొందరు ఆటగాళ్లను టీం లో నుండి బైట్లకు పంపారని వార్తలొస్తున్నాయి.
ముగిసిన జింబాబ్వే సిరీస్ తో అరంగేట్రం చేసి రెండవ మ్యాచ్ లో నే సెంచరీ తో చెలరేగిన అభిషేక్, సిరీస్ లో అద్భుతంగా ఆది ఆకట్టుకున్న రుతురాజ్ జరిగే టి-20 సిరీస్ లో చోటు కల్పించకపోవడం ఆశ్చర్యార్ధకం అంటున్నారు, దానికి గంభీర్ బదులిస్తూ, చివరికి మేము ఎంపిక చెయ్యాల్సింది 15 మందినే, అలాంటి ఆటగాళ్లను తీసెయ్యటం మాకు కూడా కష్టమే, కానీ వేరే అవకాశం లేదు. ఉదాహరణకు రింకు సింగ్ నే చెప్పారు, ఉత్తమమైన ప్రదర్శన ఇచ్చి కూడా టి-20 వరల్డ్ కప్ లో చోటు దక్కలేదంటూ చెప్పుకొచ్చారు.
ఎప్పటినుండో వార్తల్లో ఉన్న విరాట్-గంభీర్ విబేధాల గురించి కూడా గంభీర్ స్పందించారు. విరాట్ ఒక వరల్డ్ క్లాస్ బ్యాట్స్ మెన్ అని తాను ఎన్నో సార్లు చెప్పానని, విరాట్ తో చక్కని బంధం ఉంది అని,వారిద్దరూ కలిసి 140 కోట్ల మందిని గర్వపడేందుకు తాము కష్ట పడతామని బదులిచ్చారు. అలాగే తనకి కెప్టెన్ రోహిత్ తో కూడా చక్కని బంధం ఉందని చెప్పుకొచ్చారు.
విరాట్,రోహిత్ వంటి క్రికెటర్లను ప్రతి దేశం కావాలనుకుంటుంది. వారిద్దరు వరల్డ్ క్లాస్ బాట్స్మన్, వారికీ ఇంకా చాల క్రికెట్ ఉందని నేను భావిస్తున్న ని చెప్పారు. జరిగే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఇంకా వారు ఫిట్ గ ఉంటె 2027 వరల్డ్ కప్ వరుకు వారు జట్టు కు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. అలంటి వారు మన దేశం తరుపున ఆడటం ఎంతో ఆనందాన్నిస్తుంది.
శ్రీలంక తో జరగబోయే వన్ డే సిరీస్ లో అనూహ్యంగా టాప్ అల్ రౌండర్ రవీంద్ర జడేజా పేరు లేకపోవటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక అందరూ జడేజా కెరీర్ ముగిసింది అని ప్రచురించారు.. కానీ నేడు కోచ్ గంభీర్ జడేజా వన్ డే ల నుండి డ్రాప్ చెయ్యలేదని స్పష్టం చేసారు. శుబ్ మాన్ గిల్ వంటి ఆటగాడు 3 ఫార్మట్ ప్లేయర్ అని చెప్పారు.
టి-20 కెప్టెన్సీ వివాదం పై కూడా కోచ్ సమాధానమిచ్చారు. హార్దిక్ పాండ్య ఒక అత్యున్నతమైన ఆటగాడని, వారి నైపుణ్యత టీంకు ఎంతో అవసరమని, కానీ తన ఫిట్నెస్ సమస్యల కారణంగానే తన కెప్టెన్సీ పదవిని సూర్య కు అందించామని చెప్పారు. పైగా, సూర్యకుమార్ టి-20 ల లో అత్యుత్తమ శైలి లో ఆడుతాడు, వరల్డ్ క్లాస్ ప్లేయర్ కావటంతో పగ్గాలను సూర్య కె అంకితం చేసారు. పైగా సూర్య కేవలం టి-20 ల లో జట్టు తరుపున ఆడనున్నట్టు సమాచారమిచ్చారు.
ఇలా హెడ్ కోచ్ పదవి అందుకున్న తర్వాత వచ్చిన మొదటి ప్రెస్ మీట్ లోనే గంభీర్ కు ఉన్న స్పష్టతను చూసి టీం ఇండియా అభిమానులు ఖుషి అవుతున్నారు.ఇలాగే కనుక గంభీర్ జట్టు సభ్యులతో ఐకమత్యం గ ఉంటె ఐసీసీకి ట్రోఫీ ల ను గెలవటం పెద్ద పనేమీ కాదంటూ, ఇక “గంభీర పర్వం మొదలయ్యింది” అంటూ భారత క్రికెట్ లవర్స్ సోషల్ మీడియా లో తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు.8




