ఒకరుంటేనే రచ్చ… ఇక ఈ ఇద్దరూ స్టేజ్ పై ఉంటే..!

Geetha-Govindam-Audio-Launchగడిచిన రెండు, మూడేళ్ళుగా టాలీవుడ్ గా తమ యాటిట్యూడ్ ను ప్రదర్శించిన హీరోలుగా విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ నిలుస్తారు. ఒకరు ‘మెగా’ కాంపౌండ్ బ్యాక్ గ్రౌండ్ వేదికగా ఎదగగా, మరొకరు తన యాటిట్యూడ్ నే ప్రదర్శించి ఎదిగారు. సంచలన స్పీచ్ లను దట్టించడంలో ఇద్దరూ ఇద్దరే. ఒక రకంగా చెప్పాలంటే పబ్లిసిటీ స్టంట్ లు వేయడంలో సిద్ధహస్తులుగా మారారు.

[m9ad]

ADVERTISEMENT

అలాంటి ఈ ఇద్దరూ ఒకే వేదికపై కలిస్తే… ఇంకేముంది రచ్చ రచ్చే కదా..! అందుకు వేదిక అవుతోంది “గీత గోవిందం” ఆడియో. ఈ నెల 29వ తేదీన ఆదివారం నాడు ఫిలిం నగర్ జేఆర్సి కన్వెన్షన్ సెంటర్ లో జరగబోయే ఈ సినిమా ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా అల్లు అర్జున్ విచ్చేస్తున్న అంశాన్ని ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఖరారు చేసింది చిత్ర యూనిట్.

దీంతో సహజంగానే ఈ ఆడియో వేడుక ప్రేక్షకుల ఆసక్తిని రాబడుతోంది. ఒకరు మాట్లాడితేనే బోలేడలన్నీ సంచలనాలు నమోదవుతాయి, మరి ఈ ఇద్దరూ ఒకే వేదిక మీద ప్రసంగిస్తే ఏమవుతుందో తెలియాలంటే ఈ ఆదివారం వరకు వేచిచూడాల్సిందే. ఇదిలా ఉంటే, గోపిసుందర్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఇప్పటివరకు రిలీజ్ అయిన రెండు పాటలు ఇన్ స్టంట్ హిట్స్ గా నిలిచాయి.

ADVERTISEMENT
Latest Stories