“సుచిలీక్స్”పై స్పందించిన మరో సెలబ్రిటీ!

Geetha-Madhuri-reacts on suchitra leaksకోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలను ఓ కుదుపు కుదిపిన “సుచిలీక్స్” వ్యవహారం ప్రస్తుతానికి సర్దుమనిగినట్లే. అయితే అసలు ఈ ట్వీట్స్ ను ఎవరు చేసారు అనే విషయంపై స్పష్టత రానప్పటికీ, దీనిపై స్పందించడానికి కూడా సెలబ్రిటీలు ముందుకు రాలేదు. అయితే ఒక్క గాయనిగానే కాకుండా సుచిత్ర కార్తీక్ కు ఇతర విభాగాల్లో కూడా ప్రావీణ్యం ఉందని టాలీవుడ్ గాయని గీతామాధురి తెలిపారు.

ADVERTISEMENT

“సుచిత్ర ఈజ్ వెరీ స్ట్రాంగ్.. డిప్రెషన్ కు లోనయ్యే మనస్తత్వం ఆమెది కాదు. ఒక్క సింగర్ గా మాత్రమే కాదు, రేడియో జాకీ, రైటింగ్ స్కిల్స్… ఇలా మల్టీ టాలెంటెడ్ ఉమెన్, కనుక చాలా అవకాశాలు లభిస్తుంటాయి, ఎప్పుడూ చాలా బిజీగా ఉంటుంది. డిప్రెషన్ కు గురయ్యే స్టేజ్ లో ఆమె ఉందని నేను అనుకోవట్లేదు. అయితే అసలు ఏం జరిగిందో మరి! ఆమె ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైందని భావిస్తున్నా” అంటూ సుచిలీక్స్ పై తన అభిప్రాయాలను పంచుకుంది గీతామాధురి.

ఇక, తన విషయానికి వస్తే… తన కెరీర్ మొదట నుండి తనతో పాటు తల్లి కూడా వస్తుండేవారని, ఆమెతో చనువు బాగా ఎక్కువేనని, తనకు సంబంధించి ఏ విషయమూ తన తల్లికి తెలియకుండా ఉంచలేదని, ఆఖరికి తనకు ఎవరైనా ప్రపోజ్ చేసిన విషయాన్ని కూడా షేర్ చేసేసుకునేదానినని చిరునవ్వులు చిందిస్తూ చెప్పింది గీతా. 2012 సంవత్సరానికి గాను ఉత్తమ నేపథ్య గాయనిగా నంది అవార్డు అందుకోనున్న గీతా మాధురి, ఇలాంటివే బూస్ట్ లా పని చేస్తాయని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories