ఈ ఆగష్టు 15వ తేదీ సినీ ఇండస్ట్రీకి బాగా కలిసి వచ్చినట్లుంది. టాలీవుడ్ లో ‘గీత గోవిందం’కు హిట్ టాక్ లభించగా, బాలీవుడ్ లో ‘గోల్డ్, సత్యమేవజయతే’ సినిమాలకు సినీ విమర్శకులు పట్టం కట్టారు. ఈ రెండు బాలీవుడ్ సినిమాలకు ఓవరాల్ గా 3.5 నుండి 5 వరకు రేటింగ్స్ అందుకుని సత్తా చాటాయి.
[m9ad]
అవార్డు విన్నింగ్ ప్రశంసలతో పాటు కమర్షియల్ గానూ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ను అందుకున్నాయి. హాకీ క్రీడ నేపధ్యంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “గోల్డ్” సినిమా తొలిరోజు 27 కోట్లు కొల్లగొట్టగా, జాన్ అబ్రహం నటించిన “సత్యమేవ జయతే” ఆ తర్వాత స్థానంలో 18 కోట్లు సాధించింది.
ఓవరాల్ గా రెండు బాలీవుడ్ సినిమాలు 45 కోట్లు సాధించిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. హిట్లు లేక వెలవెలబోతోన్న బాలీవుడ్ కు ఈ రెండు సినిమాలు మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పడంలో సందేహం లేదు. టాలీవుడ్ ‘గీత గోవిందం’ కూడా ఫస్ట్ డే రికార్డ్ ఓపెనింగ్స్ ను అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.



