
టీడీపీలో, రాష్ట్ర రాజకీయాలలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. వైసీపీ నేతల అరెస్టులు, వాటిపై ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై తనదైన శైలిలో స్పందిస్తూ, “పేర్ని నాని వంటి పలువురు వైసీపీ నేతల తండ్రులతో నాకు స్నేహ సంబంధాలు ఉండేవి. కనుక నేను పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటివారు బూతులు తిడుతున్నప్పుడు రాజకీయాలలో అటువంటి భాష, పద్దతి మంచిది కాదని వారిని చనువుతో మందలించేవాడిని.
వారి పెద్దలతో నాకున్న అనుబందం, నా వయసు దృష్టిలో ఉంచుకొని వారు నన్ను సహించేవారు. కానీ నేను ఎంత చెప్పినా వారు తమ తీరు మాత్రం మార్చుకోలేదు. అందుకు ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తున్నారు.
Also Read – ఆంధ్ర అంటే ఇంకా నామోషీయేనా కేటీఆర్‌జీ?
వారిని ఆవిధంగా తయారుచేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపైకి ఉసిగొల్పింది వారి అధినేత జగన్మోహన్ రెడ్డి అని అందరికీ తెలుసు.
సజ్జల రామకృష్ణా రెడ్డి వ్రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను బూతులు తిట్టేవాడినని పోసాని స్వయంగా చెప్పారు కదా?ఇంత కంటే మంచి నిదర్శనం ఏముంటుంది?
Also Read – ఇవి కదా… సంస్కరణలంటే?
పోసాని ఒక్కరే కాదు.. వైసీపీలో రెచ్చిపోయిన ప్రతీ నాయకుడి వెనుక వెనుక సజ్జల, ఆయన వెనుక జగన్ ఉన్నారు. టీడీపీ, జనసేనలో నేతలను వైసీపీలో వారి కులాల నేతల చేతే తిట్టిస్తుండేవారు. కులాల మద్య చిచ్చు పెట్టి రాజకీయంగా పైచేయి సాధించాలని జగన్ అనుకునేవారు.
ఆనాడు కొడాలి నాని తదితరులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను బూతులు తిట్టడంతో సరిపెట్టుకోలేదు. రాజకీయాలతో సంబందమే లేని వారి ఇంట్లో ఆడవాళ్ళని కూడా నోటికి వచ్చిన్నట్లు మాట్లాడారు. వంశీ, పోసాని, కొడాలి, పేర్ని, జోగి, అంబటి, రోజా, ఇంకా చాలా మంది వైసీపీ నేతలు చాలా తప్పుగా మాట్లాడారు.
Also Read – ఏపీకి పెట్టుబడుల ప్రవాహం… చాలా అవసరమే!
కనుక తప్పు చేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. తప్పు చేయనివారు వైసీపీలో ఉన్నా భయపడాల్సిన అవసరమే లేదు. మేము కూడా ప్రతిపక్షాలపై చాలా ఘాటుగా విమర్శలు చేసేవారిమి. కానీ వైసీపీ నేతల్లా బూతులు మాట్లాడలేదు. పార్టీలు, విధానాల పరంగా రాజకీయ విమర్శలు మాత్రమే చేసేవారిమి. కనుక నేటికీ ఇటువంటి సమస్యలలో చిక్కుకోకుండా ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము,” అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. నిజమే కదా?