group-2-exam-andhra-pradesh

నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలు జరుగుతున్నాయి. ఇటువంటి పరీక్షలు జరుగుతున్నప్పుడు అభ్యర్ధులలో కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేయడం.. హైకోర్టుకి వెళ్ళడం సర్వ సాధారణమే. అలాగే ఎలాంటి చిన్న అవకాశం దొరికినా చెలరేగిపోవడం వైసీపీకి అలవాటే.

Also Read – వైఎస్ అవసరం జగన్‌కే.. అందుకే ఈ హడావుడి?

గ్రూప్-2 పరీక్షల నిర్వహణ విషయంలో ఏపీపీఎస్సీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మద్య అవగాహనాలోపం వలన కూటమి ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు గుప్పించగలిగింది.

షెడ్యూల్‌ ప్రకారం నేడు (ఆదివారం) గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ మొదటి నుంచి చెపుతూనే ఉంది. కానీ గ్రూప్-2 అభ్యర్ధులలో కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకొని పరీక్షల వాయిదా వేయాలంటూ ఏపీపీఎస్సీకి లేఖ వ్రాసింది.

Also Read – అందగాళ్ళ అరెస్టులు…సౌమ్యుల రాజీనామాలు..!

కానీ షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఏపీపీఎస్సీ నొక్కి చెపుతూ ప్రభుత్వానికి లేఖ వ్రాసింది. ప్రభుత్వం కూడా దాంతో ఏకీభవించింది.

వైసీపీ బ్యాచ్ ఏపీపీఎస్సీ జవాబు లేఖ గురించి దాచిపెట్టి ప్రభుత్వం వ్రాసిన లేఖని మాత్రమే హైలైట్ చేస్తూ పరీక్షలు వాయిదా పడ్డాయని ప్రచారం చేసింది. దాంతో అభ్యర్ధులలో గందరగోళం ఏర్పడింది.

Also Read – జగన్‌ పొమ్మన్నారు బాబు రమ్మన్నారు.. అశోక్ లేలాండ్‌ని

కానీ షెడ్యూల్‌ ప్రకారం నేడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరుగుతున్నాయి.

గ్రూప్-2 పరీక్షలపై ఈవిదంగా రాద్ధాంతం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి ఉంటే విమర్శలకు అవకాశం లభించేది కాదు. కానీ ఓ పక్క పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తూ, షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు జరిపిస్తున్నా కాస్త అశ్రద్ధ చూపితే వైసీపీ ఏవిదంగా అల్లుకుపోతుందో గ్రహించేందుకు ఇదో చిన్న ఉదాహరణ.

ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలండర్ ప్రకటించమని నిరుద్యోగులు కోరితే, సంక్షేమ పధకాలు క్యాలండర్ ప్రకటించిన ఘనుడు జగన్‌!

ఐదేళ్ళు సంక్షేమ పధకాల గోల తప్పితే పరిశ్రమలు, ఐటి కంపెనీలు రప్పించాలనుకోలేదు. ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు భర్తీ చేయాలనుకోలేదు. డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయుల భర్తీ చేపట్టాలనుకోలేదు. కనీసం ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించేవారు కారు. అటువంటి వైసీపీ.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 8 నెలలకే గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తుంటే విమర్శిస్తుండటం సిగ్గుచేటు. కానీ దానికి ఈ అవకాశం ఇచ్చింది మాత్రం కూటమి ప్రభుత్వమే. కనుక ఇకనైనా అప్రమత్తంగా ఉంటే మంచిది.