gujarat-titans

2025 ఐపీఎల్ కోసం గత ఏడాది జరిగిన ఐపీఎల్ ఆక్షన్ లో గుజరాత్ టైటాన్ ఎంచుకున్న జట్టు ను చూసిన ఏ ఒక్కరు కూడా గుజరాత్ టైటాన్స్ ఈ ఐపీఎల్ లో ఇటువంటి స్థాయి ప్రదర్శన ను కనబరుస్తారని ఊహించలేదు.

దానికి తోడు, క్రికెట్ పండితులు ఎవ్వరూ కూడా తమ ఐపీఎల్ 2025 ప్లే-ఆఫ్ జోస్యం లో గుజరాత్ జట్టుకు స్థానమే కేటాయించలేదు. మరి కట్ చేస్తే, ఐపీఎల్ 2025 లీగ్ స్టేజి ఓకొలిక్కి వచ్చే వేళ, గుజరాత్ జట్టు పాయింట్ల పట్టిక లో మొదటి స్థానాన్ని ఒడిసి పట్టుకుంది.

Also Read – ఇలా అయితే ఎలా కవితక్కా?

ఆ జట్టు కోచింగ్ స్టాఫ్ కు చెందిన పార్థివ్ పటేల్ గతేడాది జరిగిన ఐపీఎల్ ఆక్షన్ ముగవగానే, జట్టు పై తన అభిప్రాయాన్ని చెప్తూ, ‘తాము ఎంపిక చేసిన ఆటగాళ్లపై తమకు పూర్తి నమ్మకముందని చెప్పారు’. ఇప్పడు ఆ ఆటగాళ్లు ఆ నమ్మకాన్ని ఒమ్ము కానివ్వడంలేదు.

అయితే, లీగ్ స్టేజి ముగుస్తున్న వేళ, ఓసారి గుజరాత్ జట్టు ప్రదర్శన పై ఓ లుక్ వేద్దాం. ఇప్పటి వరకు GT గెలిచిన మ్యాచ్లలో, సింహ భాగం సుమారు బ్యాటింగ్ వలనే గెలిచారు. ఆ జట్టు టాప్-ఆర్డర్ లో ఉన్న కెప్టెన్ ‘శుబ్మన్ గిల్’ కు తోడు సీజన్ మొత్తం నిలకడగా రాణించి, ప్రస్తుత ఆరెంజ్ క్యాప్ ను ధరించిన బ్యాటర్- ‘సాయి సుదర్శన్’ కూడా జట్టు విరాజ్యాలలో కీలక పాత్ర పోషించారు.

Also Read – వైసీపీ..ఒక “అందమైన” కుటుంబం..

ఇక వీరిద్దరికి తోడుగా అటు ఇంగ్లాండ్ కు చెందిన వైట్-బాల్ వీరుడు ‘జొస్ బట్లర్’, ఆ జట్టుకు ఓటమి అనే బంధువును గడప తొక్కకుండా అడ్డుకుంటున్నారు. ఒక జట్టు నుండి ఒక బ్యాటర్ 500 + పరుగులు చేస్తేనే ఆ జట్టు బ్యాటింగ్ కు ఎటువంటి ఢోకా ఉండదని అంటారు.

అలాంటిది, గుజరాత్ జట్టునుండి ముగ్గురు బ్యాటర్లు 500 పై చిలుకు పరుగులను సాధించి, తమ బ్యాటింగ్ తో అపోజిషన్ పై హంటింగ్ చేస్తున్నారనే చెప్పాలి. అలా అని వారి బౌలింగ్ లో పస లేదా అంటే, ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా గుజరాత్ జట్టు కు చెందిన వారే.

Also Read – తల్లిపై కేసు.. తల్లికి వందనంతో మరో కేసు!


కానీ, బ్యాటింగ్ లో ఉన్న నిలకడ ను ఆ జట్టు బౌలింగ్ లో మిస్ అవుతుంది. ఇదే రూట్ లో ఇప్పటికే రెండు జట్లు ఫైనల్స్ వరుకు చేరి, అక్కడ హార్ట్-బ్రేక్ నే ఎదుర్కొన్నారు. 2016 లో ఇలాగే వచ్చిన ప్రతి జట్టును బ్యాట్ తో బీట్ చేసిన ఆర్.సి.బీ చివరికి ఫైనల్స్ లో కంగుతిన్నారు. అలాగే, 2024 లో హైదరాబాద్ బ్యాటర్స్ ఏదో పూనకం వచ్చినట్టు బ్యాటింగ్ చేసి ఆఖరికి ఫైనల్స్ లో తుస్సుమన్నారు. మరి గుజరాత్ ఆ గండాన్ని దాటగలదా..?