సర్వఅధికారాలు చేతిలో పెట్టుకుని ఉత్తరకుమార ప్రగల్భాలా?

GVL Narasimha Rao allegations on TDP Governmentఆంధ్రప్రదేశ్ లో 53 వేల కోట్లు దారిమళ్లాయని, టీడీపీ ప్రభుత్వం ఈ మేరకు సొమ్మును 58 వేల పీడీ అకౌంట్లలోకి మళ్లించి.. దేశంలోనే అతి పెద్ద కుంభకోణానికి పాల్పడిందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. ఎప్పటిలానే గుడ్డ కాల్చి మీద వేస్తాం అనే విధంగా ఆరోపణలు చేసేసి పక్కకు తప్పుకున్నారు.

ADVERTISEMENT

[m9ad]

ఇది చిన్న కుంభకోణం కాదని, 2జీ స్కాం తరహాలో పెద్ద కుంభకోణమని ఆయన చెప్పుకొచ్చారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇంత కంటే ఎక్కువ మొత్తలు పీడీ అకౌంట్లలో ఖర్చు చేశారు. మరి దీనికి సంబంధించి విచారణ సంగతి ఏమైంది. ఆ విషయం అటుంచితే కేంద్ర నిధులు మళ్ళిస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో?

దేశాన్ని ఏలే ప్రభుత్వం సర్వ అధికారాలు తన చేతిలో పెట్టుకుని తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలకడం ఏంటో? ప్రభుత్వ పరంగా చర్య తీసుకోకపోతే జీవీఎల్‌ నరసింహారావు గానీ ఇంకొకరు గానీ చేసే ఆరోపణలకు అర్ధం ఉంటుందా? ఇంతకు మొత్తం 58 వేల కోట్ల నిధులు టీడీపీ బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాకే దారి మళ్ళించారా?

ADVERTISEMENT
Latest Stories