కేంద్రం వద్దకు లోకేష్ పంపిన బ్రోకర్లను జైల్లో పెట్టించొచ్చు కదా?

GVL Narasimha Rao comments on Nara Lokeshచూడబోతే బీజేపీ నాయకులు గుడ్డ కాల్చి మీద వేస్తున్నట్టు ఉన్నారు. రాజకీయ బ్రోకర్లు, కాంట్రాక్టర్‌ బ్రోకర్లను ఏదో ఒక పని పేరుతో తరచూ తన వద్దకు పంపవద్దంటూ ఒక కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆయన కుమారుడు నారా లోకేశ్‌కు స్వయంగా చెప్పారంటే రాష్ట్రంలో అవినీతి విలయ తాండవాన్ని అర్థం చేసుకోవచ్చని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు వ్యాఖ్యానించారు.

సొంత పనుల కోసం వచ్చే బ్రోకర్లను తన వద్దకు పంపవద్దని లోకేశ్‌కు కేంద్ర మంత్రి చెప్పారని ఆయన అంటున్నారు. అయితే ఎప్పటిలానే ఆయన ఆ కేంద్రమంత్రి పేరు చెప్పలేదు. ఒకవేళ నిజంగా అలా పంపి ఉంటే వారిని అరెస్టు చేయించి ప్రజల ముందు చంద్రబాబును, లోకేష్ ను దోషిగా నిలబెట్టవచ్చు కదా?

ADVERTISEMENT

ప్రత్యర్థి పార్టీగా ఉన్న తెలుగు దేశం బ్రోకర్లను పంపితే ఎవరైనా చేసే పని అదే కదా? అలా చేయ్యలేదంటే ఇది కేవలం నామమాత్రపు రాజకీయ విమర్శ అని మాత్రమే అనుకోవాలా? రాజకీయాల్లో ఎన్నో ఢక్కా ముక్కీలు తిన్నాం అని చెప్పుకునే బీజేపీ నేతలకు ఈ విషయం తెలీదా?

ADVERTISEMENT
Latest Stories