బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు తెలుగు దేశం పార్టీని ఎదురుకోవడం కోసమే రాజ్యసభ పదవి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన రోజంతా టీవీలకు ఎక్కి తెలుగు దేశం ప్రభుత్వంపై అర్ధంలేని విమర్శలు ఎటువంటి రుజువులు లేకుండా చేస్తుండడం మన అందరికి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆయనొక చిత్రమైన ఆరోపణ చేశారు.
[m9ad]
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నిక కావడంతో తెలుగుదేశం పార్టీకి మరోసారి పరాభవం జరిగిందని ఆయన ఆక్షేపించారు. తెలుగుదేశం ప్రతిపక్ష అభ్యర్ధికి ఓటు వేసిన సంగతి తెలిసిందే. అయితే దేశాన్ని పాలిస్తున్న పార్టీ ఒక ప్రాంతీయ పార్టీతో పోలిక పెట్టుకోవడం విచిత్రంగా ఉంది.
ఒక విధంగా దేశాన్ని ఏలుతున్న ఒక జాతీయ పార్టీతో పోటీపడే స్థాయి తెలుగుదేశానికి ఉంది అని ఆయన గుర్తించినట్టే కదా? తెలుగు దేశమును విమర్శించాలనే ఉత్సాహంలో ఆయన తెలుగు దేశం పార్టీ స్థాయిని పెంచినట్టే కదా? గురువారం జరిగిన ఈ ఎన్నికలో హరివంశ్‌కు 125 ఓట్లు రాగా.. ప్రతిపక్షాల అభ్యర్థి, కాంగ్రెస్ నేత హరిప్రసాద్‌కు 105ఓట్లు దక్కాయి.



