m9-bhogi

సంక్రాంతి వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాలు వేదికయ్యాయి. ఈ సంక్రాంతి పండుగ వెలుగు జిలుగులు ‘భోగి’ మంటల నుంచే ఆరంభమవుతాయి. భోగి మంటలతో మొదలయ్యే ఈ సంక్రాంతి వేడుకలు మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు ప్రజలు.

Also Read – అయితే రోజా కూడా జంప్?షర్మిలకి జై?

ఈ సంక్రాంతి వేడుకలు, భోగి చలి మంటలు పట్టణాలలో కన్నా పల్లెలలో ఎక్కువగా దర్శనమిస్తాయి. భోగి మంటల వెలుగు జిలుగులు, రంగవల్లుల హరివిల్లులు, పిండి వంటల గుమగుమలు, కొత్త బట్టల ఆనందాలు, పతంగుల కేరింతలు, బంధు మిత్రుల సరదా కబుర్లు, కోడి పందాల హోరా హోరీలు….ఇలా ఈ మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు తెలుగు రాష్ట్ర ప్రజలను పలకరిస్తాయి.

అలాగే హరిదాసుల భజనలు, గంగిరెద్దుల మర్యాదలు పల్లెలో ప్రతి ఇంటి ముంగిట దర్శనమిస్తాయి. ఇక గోదావరి జిల్లాలలో ఈ మూడు రోజుల పాటు సాగే పండుగ సంబరాలను ప్రత్యక్షంగా చూసి ఆనందించేందుకు దేశ, విదేశాల నుంచి కూడా ఎంతోమంది తమ సొంత ఊరికి చేరుకుంటారు. అయితే ఈ భోగి పండుగను దేవతల రాజైన ఇంద్రుడికి అంకితం చేస్తారు రైతన్నలు.

Also Read – హోదా అడిగితే ఎమ్మెల్యే పదవి ఊడగొడతానంటావేమిటీ అయ్యా!


గత ఏడాది చెడుని, చేదు అనుభవాలను భోగి మంటలలో తగలబెట్టి కొత్త అనుభవాలను, కొత్త ఆనందాలను కోరుకుంటూ ఈ కొత్త ఏడాదికి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ‘M9 పాఠకులకు’ ‘భోగి’ పండుగ శుభాకాంక్షలు.