Happy Republic Day 2025

నేడు దేశవ్యాప్తంగా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలు ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాయి. దేశంలో అనేక మతాలు, కులాలు, భాషలు భిన్న సంస్కృతీ సాంప్రదాయాలు, రాజకీయ పార్టీలున్నప్పటీకీ మేమందరం ఒక్కటే… అని ప్రపంచానికి చాటిచెపుతుంటాయి ఇటువంటి వేడుకలు. ఇంత భిన్నత్వం ఉన్న భారతదేశంలో ఇటువంటి జాతీయస్పూర్తి కనిపిస్తుండటం చాలా సంతోషం కలిగిస్తుంది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పునర్నిర్మించుకోవడానికి నాటి ప్రధాని నెహ్రూ మొదలు నేడు ప్రధాని మోడీ వరకు ప్రతీ ఒక్కరూ ఎంతగానో కృషి చేస్తూనే ఉన్నారు. అందువల్లే భారత్‌ ఇంతగా అభివృధ్ది చెందింది. ఇప్పుడు మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది.

Also Read – ట్రంప్‌-మోడీ భేటీ ఎవరిది పైచేయి?

అయితే రూపాయి విలువ పడిపోతోంది కదా?ద్రవ్యోల్బణం నానాటికీ పెరిగిపోతోంది కదా?అనే ప్రశ్నలు ఆలోచింపజేస్తాయి.

నిజమే.. భారత్‌ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ రూపాయి విలువ పెరగడం లేదు. ద్రవ్యోల్బణం ఒకటి రెండు పాయింట్స్ తగ్గిన్నట్లే తగ్గి మళ్ళీ పెరిగిపోతూనే ఉంది.

Also Read – రఘురామని కూడా బాబు కాపాడుకున్నారు.. మరి వంశీని?

దేశ ఆర్ధిక వ్యవస్థని కేంద్ర ప్రభుత్వమే నియంత్రిస్తుంది. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. దేశ సంపద అంతా కొంత మంది వ్యక్తుల గుప్పిట్లోనే ఉండటం, వారే ఈ ఆర్ధిక వ్యవస్థని శాసిస్తున్నారని అందరికీ తెలుసు.

ఉదాహరణకు అదానీ గ్రూప్ పెట్టుబడుల కోసం ప్రతీ రాష్ట్రం అర్రులు చాస్తూనే ఉంటుంది. కానీ దాని అధినేత గౌతం అదానీతో ఫోటో దిగేందుకు ముఖ్యమంత్రులు సైతం భయపడుతుంటారు… ఎందువల్ల?

Also Read – కర్నూలు హైకోర్టు బెంచ్‌కి తొలి విగ్నం.. వాళ్ళేనా?

అంటే ఆయన తన వ్యాపార సామ్రాజ్య విస్తరణ కొరకు అవినీతికి పాల్పడుతున్నారని ప్రతీ ఒక్కరికీ తెలుసు. కనుక ఆయనతో ఫోటో దిగడం అంటే ఆయన అవినీతిలో తాము కూడా భాగస్వాములమని ప్రజలు భావిస్తారనే భయమే.

అదానీతో లావాదేవీలు అంటే పులి మీద సవారీ అని ప్రతీ ఒక్కరికీ తెలుసు. అయినా భయపడుతూనే సవారీకి సిద్దపడుతుంటారు. దేశ రాజకీయాలను, ఆర్ధిక వ్యవస్థని కొందరు ధనిక వ్యాపారవేత్తలు ఏవిదంగా శాశిస్తున్నారో తెలుసుకునేందుకు ఇదో చిన్న ఉదాహరణ.

కనుక ప్రభుత్వాలను నడిపే రాజకీయ పార్టీలకు, వ్యాపారవేత్తలకు మద్య ఇటువంటి బందాలు ఉన్నంత కాలం దేశ ఆర్ధిక వ్యవస్థ, దానిలో ఇటువంటి సమస్యలు ఎప్పటికీ ఉంటాయి. దేశ రాజకీయాలలో, మన ఆర్ధిక వ్యవస్థలో ఈ అవలక్షణాలు కనీసం ఒక్క శాతం తగ్గినా అంతకు పదిరెట్లు వేగంగా దేశం అభివృద్ధి చెందుతుంది. రూపాయి విలువ పెరుగుతుంది. ద్రవ్యోల్బణం తగ్గుతుంది. కానీ అది సాధ్యం కాదు. కనుక పాకిస్థాన్‌తో పోల్చి చూసుకొని సంతోషపడక తప్పదు.

భారత్‌, పాక్ దేశాలకు కొన్ని గంటల వ్యవధిలో స్వాతంత్ర్యం లభించింది. కానీ 76 ఏళ్ళ తర్వాత పాక్ ఎక్కడుంది? భారత్‌ ఎక్కడుంది?అని పోల్చి చూసుకుంటే మనమే ముందున్నామని అర్దమవుతుంది. ఇన్ని అవలక్షణాలు, సమస్యలు లేకుంటే బహుశః నేడు ప్రపంచదేశాలలో భారత్‌ నంబర్:1 స్థానంలో ఉండేది. అమెరికా తదితర అగ్రరాజ్యాలు తర్వాత స్థానాలలో ఉండేవి.




కానీ ఈ పరిస్థితులలో కూడా భారత్‌ అభివృద్ధిపధంలోనే ముందుకు సాగుతుండటం ఒక్కటే సామాన్య ప్రజలకు సంతోషం కలిగిస్తుంది. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!