ఇటీవలే థియేటర్స్ స్ట్రైక్ ఇష్యూ ఎటో మొదలయ్యి ఎటో ఎండ్ అయ్యింది. అసలు విషయం పూర్తిగా సైడ్ లైన్ అయిపోయి పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే కుట్ర అంటూ కొత్త పుంత తొక్కింది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు విడుదల కూత వేటు దూరంలో ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వల్ల సినిమా ఐదేళ్లు ప్రొడక్షన్ లో ఉండిపోయింది. అయితే ఇప్పుడు అందరి చూపు సినిమా బిజినెస్ మీదే ఉంది.
చేసిన ఖర్చు, వడ్డీల భారం కారణంగా థియేటర్స్ నుండి రాబట్టాల్సింది కూడా అంతే భారీగా ఉంది. ఈ క్రమంలో నైజాం నుండి అరవై కోట్లు ఆశిస్తున్నారు నిర్మాత.
అయితే హరి హర వీరమల్లు నైజాం లో కొత్త ఈక్వేషన్స్ కు తెర లేపుతుంది. ఇక్కడ ఉన్నది రెండే ప్లేయర్లు.
ఒకవైపు మైత్రి… ఇంకో వైపు దిల్ రాజు – సునీల్ నారంగ్-సురేష్ బాబు. సినిమా బిజినెస్ అడ్వాన్స్లు మీద నడుస్తుంది. ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లకు అడ్వాన్స్లు కడితే… డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్ కు కడతారు.
సినిమా క్రేజ్ ను బట్టి ఆ అడ్వాన్స్ తక్కువ, ఎక్కువ ఉంటుంది. అయితే అసలు ఇక నైజాంలో అడ్వాన్స్ అనేది ఇవ్వము అని దిల్ రాజు తేల్చి చెప్పారు.
ఈ తరుణంలో మైత్రి గనుక హరి హర వీరమల్లు దక్కించుకుంటే… ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎగ్జిబిటర్లకు పవన్ కళ్యాణ్ సినిమా చాలా అవసరం.
ఇప్పటివరకు నైజాంలో టర్మ్స్ దిల్ రాజు – శిరీష్ ఎలా చెబితే అలా అనే… హరి హర వీరమల్లు గనుక మైత్రికి దొరికితే ఇక మైత్రి చెప్పిన టర్మ్స్ నడవాలి. గతంలో తమను పెట్టిన ఇబ్బందులకు మైత్రి బదులు చెబుతుంది. అదే సమయంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోపంగా ఉన్నారు దిల్ రాజు అండ్ కో మీద. దానితో మరి కాస్త జాగ్రత్తగా ఉండాలి.
అడ్వాన్సులు ఇవ్వము అనడం తోనే ఈ సినిమా ఛాన్స్ దిల్ రాజు క్యాంపు కు లేనట్టే. అదీగాక సురేష్ బాబు గతంలో నిర్మాత రత్నంకు ఒక అమౌంట్ అప్పు ఇచ్చారు. వారికి గనుక సినిమా ఇస్తే ఆ అప్పు రికవరీ కూడా ఉంటుంది. దానితో మరిన్ని కాంప్లికేషన్స్. సో మైత్రికి మంచి ఛాన్స్ ఉంటుంది.
అలా అని మైత్రి హరిహర వీరమల్లు చేజిక్కించుకోవడం అంత తేలికేం కాదు. ప్రొడ్యూసర్ అడిగే రేటుకు ప్రాక్టికల్ గా ఇవ్వగలిగిన రేటుకు చాలా తేడా ఉంది.
60 కోట్లు అంటే సలార్ బిజినెస్… దేవర 44 కోట్లు… గుంటూరుకారం, గేమ్ చేంజర్ కూడా 42-43 కోట్లు ప్రీ-రిలీజ్ బిజినెస్.
ఒక్కోసారి స్టార్ సినిమాకు ఎక్కువ అడ్వాన్స్ కూడా ఇస్తారు. అయితే ఆ నిర్మాత రెగ్యులర్ గా సినిమాలు తీసే నిర్మాత అయితే… నష్టం వచ్చిన తరువాత సర్దుబాటు చేస్తారులే అనే నమ్మకం మీద ఇవ్వొచ్చు. అయితే ఏఎం రత్నం అటువంటి నిర్మాత కాదు. దానితో రిస్క్ ఎక్కువ.
సినిమాలో ఇప్పటిదాకా వచ్చిన పాటలు వైరల్ అవ్వలేదు. ట్రైలర్ వస్తే సినిమా బజ్మీద అలాగే బిజినెస్ మీద కూడా క్లారిటీ ఉండొచ్చు.




