సెలబ్రిటీలు… ఏ మాత్రం ఉపేక్షించడం లేదు..!

After Non-BB Records Who’s Working With Harish Shankarసినీ సెలబ్రిటీలను తమ బ్రాండ్లకు ప్రమోషన్ల కర్తగా చాలా సంస్థలు నియమించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సెలబ్రిటీలు వారికి కలిగే అసౌకర్యాన్ని బహిర్గతం చేయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో టెలిఫోన్ నెట్ వర్క్ లపై పలువురు సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ ఓ ఇంటర్నెట్ సంస్థపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. గత 24 గంటలుగా ఇంటర్నెట్ పని చేయడం లేదని, ఫిర్యాదు ఇచ్చినా ఫలితం లేదని, ఎవరూ కనీసం స్పందించడం లేదని, కేవలం సమాచారం మేరకు మాత్రమే ఈ ట్వీట్ చేస్తున్నానని అన్నారు. దీనికి నెటిజన్ల నుండి మద్దతు లభించింది. అలాగే సదరు ఇంటర్నెట్ సంస్థ కూడా స్పందించి, టచ్ లోకి వస్తామని ట్వీట్ చేసింది.

ADVERTISEMENT

ఇలాగే ఒక సంస్థపై అసంతృప్తిని వెల్లడించడం సెలబ్రిటీలకు కొత్త కాదు. అందులో సెలబ్రిటీల నుండి ట్వీట్ వస్తే అది సామాన్య జనంపై తీవ్ర ప్రభావితం చూపుతుంది. ఆ ఉద్దేశంతోనే సెలబ్రిటీలు బహిరంగంగా విమర్శించడానికి వెనుకాడడం లేదు. అప్పటివరకు సమాధానం ఇవ్వని సదరు సంస్థలు కూడా, సోషల్ మీడియాలోకి ఫిర్యాదు వచ్చేసరికి వెంటనే ప్రతిస్పందించడం చెప్పుకోదగ్గ విషయం.

ADVERTISEMENT
Latest Stories