వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్..!

HD Kumaraswamy

విషాక్ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ మీద భిన్న వాదనలు వినపడుతున్న తరుణంలో కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి చేసిన వ్యాఖ్యలు ఉక్కు పరిశ్రమ ఉద్యోగులతో పాటుగా ఏపీ ప్రజలకు ఊరట కలిగించేవిలా ఉన్నాయి.

ADVERTISEMENT

వైసీపీ ప్రభుత్వ హయాంలో ముందుకొచ్చిన ఈ ఉక్కు ప్రయివేటీకరణ ప్రతిపాదన పై అప్పటి ప్రభుత్వం మౌనమే తన సమాధానము అన్నట్లుగా గమ్మున ఉండిపోయింది. అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం తో ఏర్పడిన పరిశ్రమను ప్రయివేటీకరణ చేయడానికి వీలులేదంటూ అప్పటి ప్రతిపక్ష పార్టీలన్నీ ఉద్యోగుల ఉద్యమాలకు అండగా నిలిచాయి.

అయితే పోరాటం చేసిన వారే అధికారంలోకి రావడంతో ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని ఆశ పడ్డ ఉద్యోగులను తమ తప్పుడు వార్తలతో, ఫేక్ ప్రచారాలతో బెంబేలెత్తించింది వైసీపీ. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణకు కూటమి ప్రభుత్వం కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అందుకు తగ్గ పనులన్నీ జరిగిపోతున్నాయంటూ తప్పుడు కథనాలను ప్రచారంలోకి తెచ్చింది వైసీపీ.

దీనితో విశాఖ ఉక్కు పరిశ్రమ పై ఆధార పడ్డ ఉద్యోగులంతా ఒక్కసారిగా ఆందోళన చెందారు. అయితే నేడు విశాఖ ఉక్కు పరిశ్రమను సందర్శించిన కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమార్ స్వామి మాట్లాడుతూ ప్లాంట్ మూతపడుతుందని వస్తున్న వార్తలకు ఎవరు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పని చేస్తుందని, ప్లాంట్ మీద వస్తున్న తప్పుడు వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. దీనితో గత రెండు రోజులుగా వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు బ్రేక్ పడినట్లయింది. కుమార స్వామి ప్రకటనతో వైసీపీ ఫేక్ ప్రచారాలకు స్టీల్ రాడ్ గిఫ్టుగా ఇచ్చినట్లయింది అంటున్నారు టీడీపీ శ్రేణులు.

ADVERTISEMENT
Latest Stories