High Court Bench in Kurnool City

పాలన అంటే సంక్షేమ పధకాలు అమలుచేయడం కాదని జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎప్పుడు గ్రహిస్తారో తెలీదు కానీ సిఎం చంద్రబాబు నాయుడు మాత్రం పాలన అంటే ఏమిటో, ఏవిదంగా సాగాలో చూపిస్తూనే ఉన్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌, టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

దాని కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర హైకోర్టుకి, కేంద్రానికి ఈ ప్రతిపాదన గురించి తెలియజేసి అనుమతి కోరుతూ రాష్ట్ర న్యాయశాఖ లేఖలు వ్రాసింది.

Also Read – తగలబడినవి ఆ దస్త్రాలేనా?

బహుశః అవి సానుకూలంగా స్పందించినందునే అత్యవసరంగా కర్నూలు పట్టణంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి తగిన భవనాలు గుర్తించి 24 గంటలలో తెలియజేయలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ అధికారి శ్రీనివాస శివారం జిల్లా కలెక్టర్‌ రంజిత్ బాషాకు లేఖ వ్రాసి ఉండొచ్చు.

దానిపై ఆయన కూడా అంతే వేగంగా స్పందిస్తూ కర్నూలు పట్టణ శివారులో దిన్నె దేవరపాడు, బి.తాండ్రపాడు, మునగాలపాడులో ఉన్న మూడు భవన సముదాయాలను గుర్తించచి వాటి కొలతలు, సదుపాయాలు వగరా పూర్తి వివరాలు పంపించారు.

Also Read – జనసేన ‘చిరు’దరహాసం…!

వీటిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో సీనియర్ న్యాయమూర్తుల కమిటీ చర్చించిన తర్వాత ఆమోదయోగ్యంగా ఉన్నట్లయితే క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళతారు.

ఆ తర్వాత కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి హైకోర్టు సంసిద్దత వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకి తెలియజేస్తుంది. సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటవుతుంది.

Also Read – ఏపీలో క్రూజ్ పర్యాటకం త్వరలో..

ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి మరో రెండు మూడు నెలలు పట్టవచ్చు. ఆ తర్వాత కర్నూలు హైకోర్టు బెంచ్‌కి న్యాయమూర్తులు, ఉద్యోగులను కేటాయిస్తారు.

అన్ని పనులు ఇంతే వేగంతో సాగితే బహుశః ఆగస్ట్ 15 లేదా దసరాలోగా కర్నూలులో హైకోర్టు బెంచ్ పనిచేయడం మొదలవుతుంది.

హైకోర్టు బెంచ్ కోసం 15 మంది న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి సరిపడే విదంగా ఉన్న భవనాలు చూడాలని జిల్లా కలెక్టర్‌కు వ్రాసిన లేఖలో పేర్కొన్నారు. అంటే కర్నూలు హైకోర్టు బెంచ్ 15 మంది న్యాయమూర్తులతో ఏర్పాటు కాబోతోందని స్పష్టమవుతోంది.

ఈ స్థాయిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటైతే ఇక రాయలసీమ జిల్లాల ప్రజలు అమరావతిలో హైకోర్టుకి రానవసరం ఉండదు. హైకోర్టు బెంచ్ ఏర్పాటైతే కర్నూలు పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది కూడా.

ప్రస్తుతం తాత్కాలిక భవనాలలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ అది పనిచేయడం ప్రారంభించిన తర్వాత సకల సౌకర్యాలతో శాశ్విత భవన సముదాయం నిర్మిస్తామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.




జగన్‌ మూడు రాజధానులలో కర్నూలులో న్యాయ రాజధాని కూడా ఒకటి. జగన్‌ 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించినా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయలేకపోయారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోపే బెంచ్ ఏర్పాటులో ఇంత పురోగతి సాధించారు.