Hitech City in Vizag

హైటెక్ సిటీ అంటే హైదరాబాద్‌లో ఉంటుంది.. ఐటి ఉద్యోగాలు కావాలంటే బెంగళూరు వెళ్ళాలి.. వంటి నిశ్చితాభిప్రాయాలు మార్చేయబోతున్నారు సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌. యువకుడిని అని గొప్పగా చెప్పుకునే జగన్‌ కలలో కూడా ఊహించలేని స్థాయిలో 74 ఏళ్ళ చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు.

ఇదివరకు ఐటి రంగం, ఐటి కంపెనీల గురించి మాట్లాడిన చంద్రబాబు నాయుడే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్, డీప్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, డేటా సెంటర్స్ గురించి మాట్లాడుతుండటం గమనిస్తే ఈ వయసులో కూడా ఆయన ఎప్పటికప్పుడు ఎంతగా అప్‌డేట్‌ అవుతున్నారో అర్దం చేసుకోవచ్చు.

Also Read – అయ్యో పాపం ఆమాద్మీ… ఇలా కూడానా?

ఐటి మంత్రి నారా లోకేష్‌ విదేశాలలో ఉన్నతవిద్య అభ్యసించి వచ్చిన వ్యక్తి. ఐటి రంగంలో ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం గురించి పూర్తి అవగాహన కలిగినవారు.

తండ్రీ కొడుకులిద్దరికీ ఐటి రంగాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించుకోవాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి. కనుకనే విశాఖలో హైటెక్ సిటీకి ధీటుగా ‘డేటా సిటీ’ ఏర్పాటు చేయాలనే గొప్ప ఆలోచన చేశారు.

Also Read – బొత్సగారు.. మీ అనుభవమే వృధా అవుతోంది!

ఇప్పటికే విశాఖనగరంలో కొన్ని ఐటి కంపెనీలున్నాయి. కనుక మరికొన్ని ప్రఖ్యాత కంపెనీలు రప్పించి, మధురవాడ సమీపంలో 500 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక ‘డేటా సిటీ’ నిర్మించాలని మంత్రి నారా లోకేష్‌ ప్రతిపాదనకు సిఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దీనిలో 80 ఎకరాలు ‘గూగుల్ డేటా సెంటర్’కి కేటాయిస్తూ ఇప్పటికే ‘గూగుల్’తో ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా జరిగాయి. విశాఖలో మేధా టవర్స్‌ ఆవరణలో టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్)కి 30 ఎకరాలు కేటాయించింది.

Also Read – వంశీ జైలుకి… వైసీపీ కార్యకర్తలు సైలంట్?

‘అవును! హైదరాబాద్‌కి హైటెక్ సిటీ ఉన్నప్పుడు విశాఖలో కూడా ఓ హైటెక్ సిటీ ఎందుకు ఏర్పాటుచేసుకోలేము?’ ఈ ఆలోచనే ఆంధ్రా ప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి హైదరాబాద్‌, బెంగళూరుకి వలసలు వెళుతున్నవారికి మహాద్భుతంగా అనిపించకమానదు. ఈ కలని సిఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ సాకారం చేసి చూపబోతున్నారు.




ఈ ఏడాది డిసెంబర్‌లోగా విశాఖ సమీపంలో భోగాపురం వద్ద అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రాబోతోంది. రాష్ట్రంలో పర్యాటక ఆకర్షణ కేంద్రాలలో ఇప్పటికే విశాఖ నగరం ప్రదమ స్థానంలో ఉంది. రాబోయే 4 ఏళ్ళలో విశాఖలో ‘డేటా సిటీ’ కూడా ఏర్పాటు అయితే విశాఖ నగరం రూపురేఖలు సమూలంగా మారిపోతాయి.