bjps-ap-strategy

ఇటు ఏపీలోనే కాదు అటు కేంద్రంలో కూడా సొంత బలం లేని బీజేపీ 135 సీట్లతో భారీ విజయాన్ని దక్కించుకున్న టీడీపీ పార్టీ మీద పూర్తి పెత్తనం చేయగలుగుతుంది, అలాగే టీడీపీ బలాన్ని, రాజకీయ అవకాశాలను అప్పలంగా అందిపుచ్చుకుంటుంది.

ఇప్పటికే మూడు పార్టీల పొత్తు పుణ్యమా అంటూ టీడీపీ పార్టీ విజయం కోసం పోరాడిన ఎంతోమంది పార్టీ ముఖ్య నేతలను బాబు పక్కన పెట్టిన పరిస్థితి. అలాగే ఇప్పటికి అటువంటి వారికీ ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు కల్పించలేని దుస్థితి.

Also Read – బొత్సగారు.. మీ అనుభవమే వృధా అవుతోంది!

పార్టీ అధికారంలోకి వచ్చింది అనే మానసిక ఆనందం మినహా ఇప్పటికి పొత్తు కోసం తమ సీట్లను త్యాగాలు చేసిన ఎంతోమంది టీడీపీ నేతలు పిఠాపురం వర్మ, వంగవీటి రాధా ఇలా ఇంకా రాజకీయ నిరుద్యోగులుగా అవకాశాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చిన అరకొర అవకాశాలను కూడా బీజేపీ గద్ద మాదిరి టీడీపీ, జనసేన పార్టీల నుండి తన్నుకుపోతుంది. పొత్తంటే మూడు పార్టీలు కూడా త్యాగాలు చెయ్యాలి, అలాగే వారి వారి పార్టీ స్థానిక బలాన్ని బట్టి వచ్చిన అవకాశలు పంచుకోవాలి.

Also Read – తెలంగాణలో మొదలైన ‘రిజర్వేషన్ల’ లొల్లి..!

అంతే కానీ ఇలా బీజేపీ మాదిరి వచ్చిన ప్రతి అవకాశం మాకే కావాలి, మీరే త్యాగాలు చెయ్యాలి అనేలా ఉండకూడదు. వైసీపీ ఎంపీల వరుస రాజీనామాలతో ఖాళీ అవుతున్న సీట్లలో బీజేపీ తన బలానికి మించి బల ప్రదర్శన చేయడానికి ఉత్సుకత చూపిస్తుంది.

మొన్నీమధ్య జనసేన అధినేత పవన్ అన్న నాగబాబుకు దక్కాల్సిన ఎంపీ స్థానాన్నిబీజేపీ ఖాతాలో వేసుకున్నారు. దాని ఫలితం టీడీపీ ఖాతాలో పడాల్సిన మరో రాష్ట్ర మంత్రి పదవి జనసేన కోసం వెచ్చించాల్సిన పరిస్థితి. ఇక ఇప్పుడు విజయ సాయి రెడ్డి రాజీనామాతో టీడీపీ కి దక్కాల్సిన రాజ్యసభ సీటు పై మరోమారు బీజేపీ పెద్దలు కర్చీఫ్ వేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read – కర్నూలు హైకోర్టు బెంచ్‌కి తొలి విగ్నం.. వాళ్ళేనా?

దీనితో రాజ్యసభ సీటు దక్కించుకునే రాజకీయ బలం ఉన్న టీడీపీ పార్టీ మరోమారు బీజేపీ కోసం త్యాగం చేయడానికి సిద్ధం కావాల్సిందేనా అంటూ నిట్టూరుస్తున్నారు టీడీపీ మద్దతుదారులు. మరి ప్రచారంలో ఉన్న బీజేపీ ఊహాగానాలు ఫలిస్తాయా.? లేక సీటు దక్కించుకునే అవకాశం ఉన్న టీడీపీ బలం నెగ్గుతుందా.? అనేది మరికొన్ని రోజులలో తెలియనుంది.




అయితే అటు టీడీపీ శ్రేణులు మాత్రం బీజేపీ పార్టీ నేతల పదవుల కోసం, ఆ పార్టీ బలోపేతం కోసం ఇంకెంతమంది టీడీపీ నేతలు ఇంకెన్ని త్యాగాలకు సిద్ధమవ్వాలి అంటూ పార్టీ అధినేత మీద, పార్టీ ముఖ్య నాయకుల మీద తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.