దాడి నుండి తృటిలో తప్పించుకున్న హృతిక్ రోషన్!

Hrithik Roshan Istanbul, Hrithik Roshan Istanbul Airport Attack, Hrithik Roshan Istanbul Tweet, Hrithik Roshan Istanbul Terror Attack, Hrithik Istanbul టర్కీ లోని ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాడి నుంచి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తృటిలో తప్పించుకున్నాడు. ముగ్గురు ముష్కరులు దాడి చేసిన విషయం తనకు షాక్ ను కలిగించిందని, దాడి నుంచి తృటిలో తప్పించుకున్నామని చెప్పాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో హృతిక్ తెలిపారు. ఇస్తాంబుల్ విమానాశ్రయంలోని కొందరు ఉద్యోగులు మంచి మనసుతో తమకు సహాయం చేశారని తెలిపాడు.

మతం కోసం అమాయకులను దారుణంగా చంపారని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐకమత్యం చూపాలని చెప్పాడు. తమ టీమ్ క్షేమమేనని వివరించాడు. దాడికి కొద్ది సేపటి ముందు హృతిక్ ఇండియాకు ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అయింది. నిజానికి హృతిక్ ప్రయాణించాల్సిన ఓ విమానం రద్దు కాగా, మరో విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్లు లేకపోవడంతో, ఎకానమీ టికెట్లు కావాలని హృతిక్ కోరగా, అక్కడున్న అధికారులు ఇప్పించినట్టు తెలుస్తోంది. దీంతో హృతిక్ దాడి నుంచి తప్పించుకోగలిగారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories