పవన్ కళ్యాణ్ కు కోర్టు సమన్లు!

hyderabad high Court case on pawan kalyanశ్రీరెడ్డి తనపై అసభ్యంగా ప్రవర్తించిన విధానాన్ని మీడియా వర్గాలు కనీస నైతికత కూడా లేకుండా ప్రసారం చేసాయని ఆరోపణలు చేస్తూ… వరుసగా మీడియా వర్గాలపై పవన్ చేసిన ట్వీట్ల ఉదంతం తెలియనిది కాదు. ప్రస్తుతం అంతా సర్దుమనిగిన ఈ ఉదంతంలో… నాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు గానూ 10 కోట్ల మేరకు కోర్టులో పరువు నష్టం దావా వేసింది.

ADVERTISEMENT

తమ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ ట్వీట్లు చేస్తున్నారని, తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని సదరు మీడియా సంస్థ ఎండీ రాధాకృష్ణన్ అభ్యర్ధించగా, వాటిని పవన్ లెక్క చేయకపోవడంతో, సదరు మీడియా సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీనిని విచారించిన థర్డ్ అడిషనల్ చీఫ్ జడ్జ్ ఆఫ్ ది సిటీ సివిల్ కోర్టు ఈ నెల 24వ తేదీన పవన్ ను కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.

ADVERTISEMENT
Latest Stories