ప్రతీ సంతకానికి ఓ ధర… అయన సంతకాల విలువ రూ.200 కోట్లు

Hyderabad Water Board GM Assets Shock Telangana

ప్రతీ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కాస్త ఎక్కువా తక్కువా అంతే. హైదరాబాద్‌ జలమండలిలో ఏసీబీ అధికారులకు పెద్ద తిమింగలం దొరికింది. దాని పేరు సగ్గం అనంత లక్ష్మీకుమార్.

జలమండలి జీఎంగా చేస్తున్న అయన ఇంట్లో, ఆయనకు సంబందించిన మరో 8 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు జరిపితే పట్టుబడినవి: బంగారం 2.1 కేజీలు, వెండి:9.2 కేజీలు, నగదు: రూ.1.10 కోట్లు, డాక్యుమెంట్స్ ప్రకారం స్థిరాస్తుల విలువ: రూ. 5.88 కోట్లు (వాటి మార్కెట్ విలువ సుమారు రూ.100 కోట్లు).

ADVERTISEMENT

అంటే కనీసం రూ.150-200 కోట్లు పోగేశారన్న మాట! ఏసీబీ అధికారులు అయనపై కేసు నమోదు చేసి, డబ్బు, బంగారం, వెండి వస్తువులు, డాక్యుమెంట్లు, వాహనాలు వగైరా స్వాధీనం చేసుకున్నారు. ఆయనని కోర్టులో హాజరు పరిచి రెండు వారాల రిమాండ్ మీద చంచల్ గూడా జైలుకి తరలించారు.

అనంత లక్ష్మీకుమార్ తెలంగాణ రాష్ట్రమంతటా ప్రాజెక్టులు నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులో చేయడం లేదు. కేవలం హైదరాబాద్‌ నగరానికి పరిమితమైన జలమండలిలో చేస్తున్నారు. కానీ అక్కడే ఇన్ని కోట్ల ఆస్తిపాస్తులు ఎలా సంపాదించగలిగారనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకటి రెండేళ్ళలో ఎవరూ ఇన్ని ఆస్తిపాస్తులు సంపాదించలేరు. కనుక ఏళ్ళ తరబడి నిరాటంకంగా అవినీతికి పాల్పడుతున్నారని స్పష్టమవుతోంది. కానీ ఇంతకాలం ఏసీబీ అధికారుల దృష్టికి కూడా రాకపోవడం విచిత్రంగానే ఉంది.

ఒక సంస్థ జనరల్ మేనేజర్ లేదా ఎండీ ఇన్ని వందల కోట్లు సంపాదించగలిగారంటే, ప్రభుత్వంలో అవినీతి చాప కింద నీరులా వ్యాపించిపోయిందని అనుమానించక తప్పదు. కనుక సిఎం రేవంత్ రెడ్డి లేదా మంత్రులు మేము నీతినిజాయితీగా, చాలా పారదర్శకమైన పాలన సాగిస్తున్నామని ఎలా చెప్పుకోగలరు?

“ఫైల్స్ మీద సంతకాలు చేయడానికి మిగిలిన మంత్రులందరూ పైసలు (కోట్లు) తీసుకుంటారు కానీ నేను అలాంటి దానిని కాను. ఓ కంపెనీ ఫైలుపై సంతకం చేయాల్సినప్పుడు, ఓ పాఠశాల కట్టించి ఇమ్మనమని అడిగాను. వారు రూ.10 కోట్లుతో నిర్మించి ఇచ్చారు,” అని ఆమె స్వయంగా చెప్పుకున్నారు. అంటే ఆమె సంతకం విలువ రూ. 10 కోట్లనే కదా అర్థం?

ఆ లెక్కన ఎంత చెట్టుకి అంత గాలన్నట్లు ప్రభుత్వంలో కింద నుంచి పైవరకు ప్రతీ సంతకానికి విలువ ఉంటుంది. జలమండలి జీఎం సంతకాల విలువ జస్ట్ రూ.150-200 కోట్లు… అంతే!

ADVERTISEMENT
Latest Stories