ICC Champions Trophy 2025 - India Vs Australia Semi Final Match

పాకిస్తాన్ మరియు దుబాయ్ వేదికలుగా ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ లీగ్ స్టేజ్ మ్యాచ్లు నిన్నటితో ముగిసాయి. అయితే గ్రూప్-A నుండి భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు సెమిస్ కు అర్హత సాధించగా, గ్రూప్-B నుండి సౌత్-ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా జట్లు సెమీస్ ను చేరాయి.

రేపు దుబాయ్ వేదికగా భారత్ -ఆస్ట్రేలియా మొదటి సెమి ఫైనల్ ఆడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, భారత్ అభిమానులు గతంలో జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా నాకౌట్ మ్యాచ్లను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. గడిచిన కాలంలో భారత్ -ఆస్ట్రేలియా మధ్య ఎన్నో ఉత్కంఠమైన పోరులు జరిగాయి.

Also Read – పోసాని కేసు: అత్యుత్సాహం వద్దు రాజా!

కానీ, భారత్-ఆస్ట్రేలియా పోరు అంటే భారత అభిమానులకు గుర్తుకువచ్చేది 2023 వరల్డ్ కప్ ఫైనల్. కప్ కచ్చితంగా మనదే అనుకున్న నాడు, ఆసీస్ తమ సామర్ధ్యాన్ని వెదజల్లి కప్ ను ఎగరేసుకుపోయారు. అదే ఏడు లో జరిగిన టెస్ట్ ఫైనల్ ను సైతం భారత్ ఆస్ట్రేలియా చేత ఓటమిపాలయింది.

అందుకు ప్రతీకారంగా గత ఏడాది జరిగిన టీ-20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా సెమీస్ కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ తమ నైపుణ్యాన్ని ప్రదర్శింపజేసి ఆసీస్ ను కనీసం సెమీస్ లోకి కూడా అడుగు పెట్టనివ్వలేదు. అలా భారత్-ఆసీస్ తలపడిన ప్రతిసారి అభిమానులకు అద్భుతమైన మ్యాచ్ ను అందించటం పక్కా అనేలా మైదానంలో ఇరు జట్ల మధ్య నువ్వా నేనా అనే ఉత్కంఠ పోరు నడుస్తుంది.

Also Read – పోసాని కి దక్కని జగన్ ఓదార్పు…వై.?


ఇక, ఇప్పటికే టీం ఇండియా కు ‘హెడ్’ఏక్ గా తయారయ్యాడు ట్రావిస్ హెడ్. ఎవరిమీద ఎలా ఆడినప్పటికీ, ఇండియా అనేసరికి చెలరేగి ఆడతాడు హెడ్. అలాగే, భారత్ లో విరాట్ మరియు రోహిత్ శర్మ ల కు సైతం ఆసీస్ పై చాల మంచి గణాంకాలున్నాయి. రేపటి సెమి-ఫైనల్ లో విజయమైతే ఇరు జట్లకు అంత సులువుగా రాదు. చూడాలి మరి, ‘హెడ్’ ను కట్టడి చేసి, భారత్ ఫైనల్స్ కు ఎగబాకుతారా అని..! ఆల్ ది బెస్ట్ టీం ఇండియా..!