‘దేవదాసు’తో ఎంట్రీ ఇచ్చి ‘పోకిరి’తో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన నాభి సుందరి ఇలియానా, గత కొంతకాలంగా తెలుగు సినిమాలను పక్కనపెట్టిన విషయం తెలిసిందే. టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈ బ్యూటీని, బాలీవుడ్ కూడా ఆదరించలేదు. కావాల్సిన హిట్లు, ప్రదర్శించాల్సిన గ్లామర్ ఉన్నప్పటికీ బాలీవుడ్ లో ఆశించిన విధంగా సినిమాలు రాకపోవడంతో, ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఇలియానాను మళ్ళీ టాలీవుడ్ అక్కున చేర్చుకుంటోంది.
నిజానికి ఈ బ్యూటీని రీ ఎంట్రీ ఇప్పించాలని చాలామంది దర్శకనిర్మాతలు ప్రయత్నించినప్పటికీ అత్యధిక పారితోషికం డిమాండ్ చేసి తెలుగు సినిమాలను చేయనని పరోక్షంగా చెప్పిందనే టాక్ గతంలో ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం మాత్రం ఓ టాలీవుడ్ సినిమాకు సైన్ చేసింది. టాలీవుడ్ లో వరుసగా బ్లాక్ బస్టర్లను నమోదు చేసుకుంటోన్న మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోన్న “అమర్ అక్బర్ అంతోనీ” సినిమాలో ఇలియానాను ఎంపిక చేసినట్లుగా తాజాగా ట్వీట్ చేసారు.
తెలుగు సినిమాతో మళ్ళీ బ్యాక్ కు రావడం శుభపరిణామం అంటూ చిత్ర యూనిట్ ఓ ఫోటోను రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని ఖరారు చేసింది. ఈ సినిమా నుండి అను ఇమ్మానుయెల్ తప్పుకోవడంతో ఖాళీ అయిన స్థానాన్ని ఇలియానా భర్తీ చేసిందన్న మాట. రవితేజ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకతం వహిస్తుండగా, ఎస్.ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. దసరాకు రిలీజ్ ప్లాన్ చేసినప్పటికీ, అప్పటికి విడుదల కావడం డౌట్ అన్నది టాలీవుడ్ టాక్.



