
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చాలా ప్రాణ భయంతో ఉండేవారు. తాడేపల్లి ప్యాలస్ చుట్టూ ఎత్తైన ఇనుప కంచెలు పెట్టించుకోవడం, బయటకు వస్తే పరదాలు కట్టించుకోవడం, పచ్చటి చెట్లు నరికించేయడం అందరూ చూశారు.
చింత చచ్చినా పులుపు చావద్దన్నట్లు జగన్ అధికారం కోల్పోయినా ప్రాణభయం మాత్రం పోలేదు. అందుకే నేటికీ ప్రజల మద్యకు రావడానికి భయపడుతూ ప్యాలస్‌లోనే ప్రజలకు దర్శనం ఇస్తున్నారు. ప్యాలస్‌లో కూర్చొని ట్వీట్స్ వేస్తున్నారు.
Also Read – అందగాడికే ఇన్ని కష్టాలు…!
తాను ప్రాణ భయంతో భయపడుతున్నాని అందుకే ప్యాలస్‌లో నుంచి బయటకు రావడం లేదనే విషయం జగన్ స్వయంగా బయటపెట్టుకున్నారు. తనకు మళ్ళీ ముఖ్యమంత్రి స్థాయిలో జెడ్ ప్లస్ భద్రత పునరుద్దరించాలని కోరుతూ జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలు చూస్తుంటే టిడిపి రాజకీయ ప్రత్యర్ధులను అంతమొందించడానికి పెద్ద కుట్ర జరుగుతోందని, ఇదే విషయం కేంద్రానికి తెలియజేసినా పట్టించుకోలేదని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Also Read – అందరి చూపు, నాని HIT వైపే
ముఖ్యమంత్రి కాకముందు జగన్‌కు ప్రాణభయం ఉండేది కాదు. పాదయాత్ర చేస్తూ ప్రజలకు విరివిగా ముద్దులు, ఆశీర్వాదాలు ఇచ్చేవారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జగన్‌లో ప్రాణ భయం మొదలైంది. ముఖ్యమంత్రికి ప్రాణభయం! ఎవరి వల్ల అని ప్రశ్నించుకుంటే ప్రతిపక్షాల వలన కాదని అర్దమవుతుంది.
మరెవరి వలన?అంటే… వివేకా హత్యతో ఏర్పడిన కొత్త శత్రువుల వలనా? నక్సల్స్ వలనా? భూకబ్జాలు, మాఫీయాల వలనా? మరెవరివలన? అనే ప్రశ్నకు సమాధానం దొరకదు. కానీ ఇప్పుడు మాత్రం టిడిపి కూటమి ప్రభుత్వం, సిఎం చంద్రబాబు నాయుడు వలన అని చెపుతున్నారు.
తనను హత్య చేయించాలనే పెద్ద కుట్రతోనే రాష్ట్ర ప్రభుత్వం భద్రత తగ్గించేసిందని పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రాణభయంతోనే బయటకు రావడం లేదని హైకోర్టులో పిటిషన్ వేసి మరీ చెప్పుకున్నప్పుడు తాను బయటకు వస్తే టిడిపి, చంద్రబాబు నాయుడు భయంతో వణికిపోతున్నారని గొప్పలు చెప్పుకోవడం దేనికి? పార్టీ కార్యకర్తలకు భరోసాగా ఉంటానని హామీలు ఎందుకు ఇస్తున్నట్లు?
నిజానికి జగన్ హయాంలోనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌తో సహా టిడిపి నేతల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండేది. వారిపై రాళ్ళ దాడులు కూడా జరుగుతుండేవి. అయినా వారు భయపడకుండా ప్రజల మద్యనే తిరుగుతూ జగన్, వైసీపి నేతల దౌర్జన్యాలను భరిస్తూ, ఎదుర్కొంటూ పోరాడేవారు.
కానీ జగన్ ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప శాసనసభకు రానని, జెడ్ ప్లస్ భద్రత ఇస్తే తప్ప ప్రజల మద్యకు రానని చెపుతున్నారు. ఏమనుకోవాలి?