అప్పులిస్తాం.. మా ఆయుధాలు కొనుకొని యుద్ధం చేసుకోండి!

IMF Approves 1Billion US Dollars

భారత్‌-పాక్‌ యుద్ధం విరమించాలని ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే అవి నిజంగానే యుద్ధ విరమణ జరగాలని కోరుకుంటున్నాయా?అంటే కాదనే భావించాల్సి ఉంటుంది. యుద్ధం విరమించుకోవాలని ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తూనే, అవే సభ్యులుగా ఉన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు రుణం మంజూరు చేశాయి.

ఐఎంఎఫ్ సభ్య దేశాలు భారత్‌ అభ్యంతరాలని పట్టించుకోకుండా ఇటువంటి సమయంలో పాకిస్థాన్‌కు అత్యవసరంగా అంత భారీగా నిధులు విడుదల చేస్తుండటం గమనిస్తే, అవి భారత్‌-పాక్‌ యుద్ధం కొనసాగలనే కోరుకుంటున్నట్లు భావించాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

ఒక్కో దేశానికి లేదా కొన్ని దేశాల సముదాయానికి ప్రత్యేక ఆసక్తులు, కారణాలు ఉంటాయి. ఉదాహరణకి ఈ యుద్ధం వలన భారత్‌ తీవ్రంగా నష్టపోతే చైనాకు లాభం. అలాగే పాక్‌ చితికిపోతే దానికి చైనా మరింత భారీగా రుణం ఇచ్చి ఆ దేశాన్ని తన గుప్పెట్లో తెచ్చుకోగలదు.

ఇజ్రాయెల్, రష్యా, ఫ్రాన్స్ దేశాల నుంచి కొనుగోలుచేసిన డ్రోన్లు, గగనతల రక్షణ వ్యవస్థ, యుద్ధవిమానాలను భారత్‌ ఉపయోగిస్తుండగా, అమెరికా, చైనా, టర్కీ దేశాలు అందినచ్చిన ఆయుధాలని పాక్‌ వినియోగిస్తోంది.

ఈ యుద్ధం కొనసాగుతున్న కొద్దీ భారత్‌, పాక్‌ వద్ద ఆ ఆయుధ నిలువలు తగ్గుతుంటాయి. కనుక ఆయా దేశాలు భారత్‌, పాక్‌లకు తమ ఆయుధాలు, యుద్ధ విమానాలు, టెక్నాలజీని ఈ సమయంలోనే ఎటువంటి బేరసారాలు లేకుండా మంచి ధరకు అమ్ముకొని భారీగా లాభపడవచ్చు.

మతపరమైన కారణాలతో భారత్‌ని వ్యతిరేకించే కొన్ని దేశాలు పాకిస్థాన్‌కి ఆర్ధిక, ఆయుధ, సాంకేతిక సాయం అందిస్తూ భారత్‌ని దెబ్బ తీయాలని ప్రయత్నించవచ్చు.

ఈవిదంగా ఎవరి కారణాలు వారికుంటాయి కనుకనే యుద్ధం విరమించాలని చెపుతున్న ప్రపంచ దేశాలు, అత్యవసర పరిస్థితిలో ఉన్న పాకిస్థాన్‌కి ఉదారంగా బిలియన్ డాలర్లు రుణం అందించి యుద్ధానికి తోడ్పడ్డాయని అనుకోవచ్చు. కనుక పాకిస్థాన్‌ని వీలైనంత త్వరగా నిర్వీర్యం చేసి ఈ యుద్ధం ముగించడం భారత్‌కు చాలా చాలా అవసరం.

ADVERTISEMENT
Latest Stories