ఖమ్మం ఎంపీపై ఆదాయపు పన్ను శాఖ దాడులు

Ponguleti Srinivas Reddyఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాపార సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లో 12 చోట్ల, ఖమ్మంలో 6 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఖమ్మం నగరంలోని ఎంపీ నివాసంలో కూడా ఉదయం నుండి సోదాలు చేపట్టారు. ఎంపీ ఇంటిలోకి ఎవరూ ప్రవేశించకుండా రెండు గేట్లను మూసివేశారు.

[m9ad]

ADVERTISEMENT

మరోవైపు బంజారాహిల్స్‌లోని ఆయనకు చెందిన రాఘవ ఇన్‌ఫ్రా కార్యాలయంలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను చెల్లింపుల అవకతవకల విషయంలో ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ తనిఖీలు రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

2014 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా నుంచి గెలుపొందిన పొంగులేటి 2016 ఏప్రిల్‌లో తెరాసలో చేరారు. తెరాస మద్దతుగా ఉన్న ఎంపీపై ఐటీ సోదాలు జరగటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇందులో ఏమైనా తేడా జరిగితే అది వచ్చే ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందేమో అని అధికారపార్టీ నాయకులు భయపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories