త్రిషను వదలని ఐటీ శాఖ!

Income Tax raids on Trisha Krishnan2010-11వ సంవత్సరంలో తన ఆదాయం 89 లక్షలుగా అడ్వాన్స్ రిటర్న్స్ దాఖలు చేసిన త్రిష, సినిమాల్లో నటించే నిమిత్తం తీసుకున్న అడ్వాన్స్ లను ఇందులో కలపలేదు. ఐటీ నిబంధనల ప్రకారం, అడ్వాన్స్ గా తీసుకున్న మొత్తం కూడా ఆదాయ పరిధిలోకి వస్తాయి. వీటికి కూడా అదే ఏడాదిలో పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ, నిబంధనలను అతిక్రమించినందుకు గానూ త్రిషకు 1.15 కోట్ల జరిమానాను విధించింది.

అయితే ఐటీ శాఖ జరిమానా విధించడం సబబు కాదంటూ ట్రైబ్యునల్ ను త్రిష ఆశ్రయించడం, ఆమెకు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఐటీ శాఖ మద్రాసు హైకోర్టులో గురువారం నాడు పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి సుందర్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories