ఎప్పుడెప్పుడా అని క్రికెట్ ప్రపంచమంతా ఎదురుచూసిన ‘ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ’ షెడ్యూల్ మరియు గ్రూప్ ల ను నిన్న ఐసీసీ అధికారంగా విడుదలచేశారు. 8 జట్లను 2 గ్రూపులుగా విభజించి, గ్రూప్ కు నాలుగేసి జట్లు ఉండేలా చూసారు ఐసీసీ యాజమాన్యం. గ్రూప్-A మరియు గ్రూప్-B తో మొత్తం సుమారు 20 రోజుల పాటు సాగనుంది ఈ టోర్నీ.
Also Read – ఆ ఇద్దరు కలిస్తే…ఈ ఇద్దరికీ కడుపు మంటేగా.?
భారత్, బంగ్లా, పాక్, న్యూజిలాండ్ జట్లు గ్రూప్-A అవగా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అఫ్గాన్ జట్లు గ్రూప్-B గా నిశ్చయించారు. ఫిబ్రవరి 19 న లాంఛనంగా ‘పాక్ vs న్యూజిలాండ్’ తో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవనుంది. బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ తో ఫిబ్రవరి 20 న భారత్ తన మొదటి ఆటను మొదలుపెట్టనుంది. ఇక ఆ వారం వచ్చిన ఆదివారం ప్రపంచమంతా ఎదురుచూసే ‘ఇండియా vs పాకిస్తాన్’ పోరు.
అయితే, తొలుత ఈ టోర్నీ ను పాకిస్తాన్ వేదికగా నిర్వహించాలనుకున్నా, భారత బోర్డు ఇందుకు అంగీకరించకపోవడంతో, టీం ఇండియా ఆడే మ్యాచ్లన్నీ తటస్థ వేదికైన ‘దుబాయ్’ ను ఖరారు చేసింది ఐసీసీ. ఫిబ్రవరి 23 న టోర్నీ కే హైలైట్ గా నిలిచే ‘ఇండో-పాక్’ మ్యాచ్ ఖరారయింది. ఈ మ్యాచ్ ను ఆదివారం షెడ్యూల్ చేయటంలో ఐసీసీ ఈ పోరు పై చూపుతున్న మక్కువ ను తెలియజేస్తుంది.
Also Read – ప్రమోషన్స్ తో పిచ్చెక్కిస్తున్నారుగా!
ప్రతి జట్టు వారికి నిర్ణయించిన 3 మ్యాచ్లను ఆడగా, రెండు గ్రూపుల నుండి టాప్-2 జట్లు సెమి ఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. అయితే భారత్ ఆడబోయే మూడవ మ్యాచ్ కూడా ఆదివారమే కావటం విశేషం. మార్చ్ 2 న న్యూజిలాండ్ తో భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. సెమి-ఫైనల్ తేదీలు, వేదికలు ఖరారయినప్పటికీ, ఏ సెమి-ఫైనల్ ఎవరు ఆడనున్నారనేది ఇంకా ఖరారవలేదు.
ఒకవేళ భారత్ సెమిస్ కు వెళ్తే, వారు ‘దుబాయ్’ లోనే ఆడనున్నారు కాబట్టి, భారత్ లీగ్ స్టేజ్ ముగిసేపాటికి, పాయింట్ల పట్టిక లో వారి స్థానాన్ని బట్టి సెమి-ఫైనల్ ఏదనేది ఆధారపడనుంది. దీనితో, అభిమానులు ఎంతగానో నిరీక్షించిన షెడ్యూల్ మరియు గ్రూప్ వివరాలు రావటం తో క్రికెట్ ప్రపంచమంతా ఖుషి అవుతుంది. మరోసారి ‘ఇండో-పాక్’ క్రికెట్ వార్ ను చూసేందుకు అభిమానులంతా సరిపోదా ఆదివారం అంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.