పొరుగింటికి నిప్పు అంటుకుంటే…

India Faces Fallout from Unrest in Neighboring Nations

పొరుగింటికి నిప్పు అంటుకుంటే… అది తప్పకుండా మన ఇంటికి కూడా అంటుకుంటుంది. కనుక చూస్తూ ఊరుకోకూడదు. తలో చెయ్యి వేసి మంటలు ఆర్పాల్సిందే!

ఇప్పుడు భారత్‌ పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. ఓ పక్క బంగ్లాదేశ్, మరోపక్క నేపాల్ మంటలు చల్లారడం లేదు. ఇక పాకిస్తాన్ సరేసరి. అదో అంతర్జాతీయ ఉగ్రవాద శిబిరంగా మారి క్యాన్సర్ వ్యాధిలా భారత్‌ని దశాబ్దాలుగా పట్టిపీడిస్తూనే ఉంది.

ADVERTISEMENT

శ్రీలంకలో ఎల్‌టీటీఈ యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఆ దేశానికి సాయం చేయబోయి, ఏకంగా ప్రధాని (రాజీవ్ గాంధీ)నే బలిచ్చుకున్నాము. ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్‌ చేసిన సాయం అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు ఆ దేశం పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది.

భారత్‌ చుట్టూ ఉండే ఈ చిన్నచిన్న దేశాలకు ఎంతగానో తోడ్పడినప్పటికీ, ఆయా దేశాల ప్రజలు భారత్‌ని ద్వేషిస్తుండటం చాలా బాధాకరం. తాజాగా నేపాల్‌లో జరిగిన ప్రజా తిరుగుబాటులో కూడా భారతీయుల పట్ల ద్వేషం చాలా స్పష్టంగా కనపడింది.

భారత్‌ చుట్టూ గల ఈ దేశాలలో ప్రజలకు భారత్‌ పట్ల ద్వేషానికి రకరకాల కారణాలు ఉండవచ్చు. వివిధ శక్తుల ప్రభావం వల్ల కావచ్చు.

ఏది ఏమైనప్పటికీ ఇరుగు పొరుగు దేశాలు పెను సమస్యలలో చిక్కుకుంటే అవి భారత్‌కు కూడా విస్తరిస్తాయి. ఉదాహరణకు బంగ్లాదేశ్ నుంచి లక్షలాది రోహింగ్యాలు భారత్‌లో ప్రవేశించి ప్రాంతీయ పార్టీల మద్దతుతో వివిధ రాష్ట్రాలలో స్థిరపడినట్లు వార్తలు వింటూనే ఉన్నాము. ఆ మేరకు అర్హులైన నిరుపేద భారతీయులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందాల్సిన పధకాలు అందక నష్టపోతుంటారు.

కనుక పోరుగింటికి మంటలు అంటుకుంటే భారత్‌ చూస్తూ ఊరుకోలేదు. నేపాల్లో మళ్ళీ సాధారణ పరిస్థితికి తీసుకువచ్చేందుకు భారత్‌ యధాశక్తిన సాయపడుతూనే ఉంది. కానీ ఆ దేశ ప్రజలు ద్వేషిస్తున్నా కూడా సాయం చేయాల్సి రావడం బాధాకరమే కదా?

ADVERTISEMENT
Latest Stories