
భారత్ – పాక్ ఇరు దేశాల మధ్య నెలకొన్నయుద్ధ వాతావరణంతో భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలబాట పట్టాయి. ట్రంప్ టారిఫ్ దెబ్బకు ఒక్కసారిగా కుదేలైన దేశీయ మార్కెట్లు మెల్లి మెల్లిగా తిరిగి యదా స్థానానికి చేరుకుంటున్నాయి అనుకునే లోపు మళ్ళీ పెహల్గామ్ ఉగ్రదాడి భారతీయ మార్కెట్లను కుంగతీసాయి.
Also Read – రప్పా రప్పా నరుకుతాం.. అవునా.. తప్పేమిటి?
అయితే భారత్ లో జరిగిన పెహాల్గమ్ ఉగ్రదాడికి ప్రతి చర్యగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో అటు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు పాతాళానికి పడ్డాయి. పాక్ తో పోలిస్తే భారతీయ మార్కెట్లు అంతగా నష్టపోనప్పటికీ, ఇరు దేశాల మధ్య ఏం జరగబోతుంది అనే ఆందోళ ఇన్వెస్టర్లను భయపెట్టిన మాట వాస్తవం.
ఆ ఆందోళనకు, ఆ భయాలకు చెక్ పడేలా నేడు భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలలో ప్రారంభమయ్యాయి. దీనితో రెండు దాయాది దేశాల మధ్య జరిగిన సీజ్ ఫెయిర్ ఒప్పందం భారత్ మార్కెట్లను బుల్ జోరులోకి తీసుకువెళ్లాయంటున్నారు మార్కెట్ ఎనలిస్టులు.
Also Read – కొమ్మినేనికి ప్రమోషన్ ఖాయమేనా.?
ప్రస్తుతం నిఫ్టీ బ్యాంకు 707 పాయింట్ల లాభాలతో 24700 వద్ద ట్రేడ్ అవుతుంటే, సెన్సెక్ 2080 పాయింట్లు పైకి ఏకబాకి 64620 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇటు బ్యాంకింగ్ నుంచి అటు ఫైనాన్స్, మోటర్ సెక్టర్ల వరకు అన్ని లాభాలబాట పట్టాయి.
అయితే ఈ రోజు మధ్యాహ్నం భారత్ – పాక్ డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ అధికారుల మధ్య జరగనున్న చర్చలు ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తాయో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్న వేళ అందుకు తగ్గట్టుగా దేశీయ మార్కెట్లు కూడా స్పందించే అవకాశం లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు.
Also Read – సొంత చెల్లినే పీడించిన జగన్ ప్రత్యర్ధులను ఉపేక్షిస్తారా?
అలాగే ఇటీవల చైనా, అమెరికాల మధ్య మొదలైన ట్రంప్ టారిఫ్ దెబ్బతో ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలయ్యింది. దీనితో అమెరికా, చైనా ఉత్పత్తుల మీద 145 % టారిఫ్ విదిస్తే అందుకు ప్రతిగా చైనా, అమెరికా వస్తువుల పై 125 % టారిఫ్ విధించింది. ఈ రెండు దేశాల ట్రేడ్ వార్ అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
అయితే ఈ రెండు దేశాలు కూడా తమ ట్రేడ్ వార్ ను చర్చలతో పరిష్కరించుకున్నట్టు ప్రకటించాయి. స్విజర్లాండ్ లోని జెనీవాలో చైనా,అమెరికా దేశాల మధ్య ట్రేడ్ చర్చలు జరిగాయని, రెండు దేశాల ప్రతినిధులు ఇందుకు సానుకూలంగా స్పందించినట్టు, పూర్తి వివరాలు అతి త్వరలోనే వివరిస్తామంటూ వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ రెండు దేశాల మధ్య సానుకూలమైన ట్రేడ్ డీల్ జరిగితే అది భారత్ స్టాక్ మార్కెట్ల పై ప్రతికూల ప్రాభవం చూపే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి భారతీయ స్టాక్ మార్కెట్లు రానున్న పరిస్థితులలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకుంటూ తన బుల్ జోష్ ను కొనసాగిస్తూ ఇన్వెస్టర్లకు లాభాలను చేకూర్చి పెట్టగలదా.?