
తెలుగింట సంక్రాంతి పండుగ సంబరాలు ఓ కొలిక్కి వచ్చాయనుకునే లోపే, అసలు పండగ ముందు ఉంది అని గుర్తుచేసుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. ప్రతీ ఏటా సంక్రాంతి సెలవులకు కుటుంబమంతా ఒక చోటే చేరి, పండగ వేళ పిండి వంటలు, పలకరింపులతో పాటు సినిమా కబుర్లు, క్రికెట్ ముచ్చట్లు ఇలా మాంచి టైం పాస్ కార్యక్రమాలు అనేకం దర్శనమిస్తాయి.
కానీ, ఈసారి సెలవులలో క్రికెట్ అభిమానులకు పెద్దగా ఊరించే మ్యాచ్లేమి లేకుండానే పండగ అయిపోయినప్పటికీ, పండగ లాంటి క్రికెట్ సీజన్ వారి కళ్ళముందుకు రాబోతుంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శుబ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి అంతర్జాతీయ గుర్తింపు గల ఆటగాళ్లు రంజీలలో పాల్గొననున్నట్లు వస్తోన్న వార్తలకు మన క్రికెట్ ప్రపంచమంతా రంజీలపైనే వెయ్యి కళ్ళుతో కాపు కాస్తుంది.
Also Read – చంద్రబాబు నాయుడు విధానాలే కరెక్ట్?
ఓ పక్క రంజీ లలో ని ఈ సెషన్ జనవరి 23 నుండి మొదలవనుండగా, జనవరి 22 నుండి భారత్ vs ఇంగ్లాండ్ ద్వైపాక్షిక టీ-20 ఆరంభమవనుంది. ఈ సిరీస్ లో అందరి చూపు సంజు, నితీష్, తిలక్ వంటి యువ ఆటగాళ్లపై ఉండనుంది. ఇక, ఈ టీ-20 సిరీస్ పిమ్మట వన్ డే సిరీస్ కు మళ్ళీ సీనియర్ ఆటగాళ్లు జట్టులోకి రానున్నారు.
ఈ వన్ డే సిరీస్ పూర్తవగానే, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ షెడ్యూల్ అయ్యి ఉంది. ఈ టోర్నీ మార్చ్ 9 వరుకు జరగనుండగా, మార్చ్ 21 నుండి ఐపీఎల్ మొదలవనుంది అని ఇప్పటికే నెట్టింట విస్తృతంగా ప్రచారమవుతుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టు నుండి వెలి వేసిన ఆటగాళ్లు ఈ ఐపీఎల్ లో తమ సత్తా చూపి మళ్ళీ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్నారు.
Also Read – సిఎం కంటే మంత్రులకే మంచి ర్యాంక్స్… భళా!
ఇలా, పండగ ముగిసి ఇంకా వారమైనా కాలేదు.. అప్పుడే క్రికెట్ అభిమానులకు మరొక పెద్ద పండగ కాలం వారి కళ్ళ ముందు కనబడుటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. వారి ఉత్సవాహానికి తగ్గట్టే మన సీనియర్ ప్లేయర్స్ మళ్ళీ ఫామ్ అందుకుని, ఈసారి జరిగే ‘ఛాంపియన్స్ ట్రోఫీ’ ను ముద్దాడాలని కోరుకుందాము. చూడాలి మరి మన సీనియర్ ప్లేయర్స్ రంజీ లలో రాణిస్తారా..?