చావుతప్పి కన్నులొట్టపోవడం అంటే ఇదేనేమో! ఏషియన్ కప్ లో భాగంగా హాంగ్ కాంగ్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి అంచుల దాకా వెళ్లి, ఎట్టకేలకు విజయాన్ని అందిపుచ్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 285 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 127 పరుగులతో కదం తొక్కడంతో, ఒకానొక దశలో భారీ స్కోర్ దిశగా పయనించింది.
[m9ad]
అయితే ధావన్ ఔటైన తర్వాత బ్యాట్స్ మెన్లంతా పెవిలియన్ కు క్యూ కట్టడంతో, చివరి 10 ఓవర్లలో కేవలం 45 పరుగులు మాత్రమే లభించాయి. అయితే లక్ష్య చేధనలో అసలు ట్విస్ట్ వచ్చిపడింది. హాంగ్ కాంగ్ ఓపెనర్లు ఏ మాత్రం ఒత్తిడికి గురికాకుండా తొలి వికెట్ కు ఏకంగా 174 పరుగులు జోడించడంతో మ్యాచ్ హాంగ్ కాంగ్ వైపున నిలిచింది.
అయితే తొలి వికెట్ పడిన తర్వాత క్రమం తప్పకుండ వికెట్లు నేలకూలడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 259 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 26 పరుగుల విజయాన్ని టీమిండియా సొంతం చేసుకుంది. మొదటి మ్యాచ్ ఆడుతోన్న భారత బౌలర్ అహ్మద్ 3 వికెట్లు సొంతం చేసుకోగా, చాహాల్ 3, కులదీప్ 2 వికెట్లతో సత్తా చాటారు. నేడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.



