India vs New Zealand Final

నిన్న జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండవ సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టు విజేతలుగా నిలిచి మార్చ్ 09 న టీం ఇండియా తో దుబాయ్ వేదికగా ఫైనల్ ఆడేందుకు అర్హత సాధించారు. ఇక, ఎప్పటిలాగే సౌత్ ఆఫ్రికా జట్టు మిల్లర్ సెంచరీ కొట్టినప్పటికీ ఆ సెమి ఫైనల్ గండంలో చిక్కుకుని ఓటమి పాలయ్యారు.

ఇక భారత జట్టు ఫైనల్ ను న్యూజిలాండ్ జట్టుతో ఆడనుంది అని తెలిసినప్పటి నుండి ప్రతి భారత అభిమానికి తెలియని భయమేదో పట్టుకుంది. గతంలో ఈ జట్లు ఆడిన నాక్-అవుట్ మ్యాచ్లను గుర్తుకు తెచ్చుకుంటున్నారు అభిమానులంతా. గత వరల్డ్ కప్ సెమిస్ లో భారత జట్టు న్యూజిలాండ్ ను ఓడించినప్పటికీ, ఆ గెలుపు అంత సులువుగా ఏమి రాలేదు.

Also Read – పవన్ లక్ష్యం గురి తప్పిందా.? గురి తప్పిస్తున్నారా.?

న్యూజిలాండ్ జట్టు టి-20 మరియు టెస్ట్ ఫార్మటు లో ఆటతీరు ఎలా ఉన్నప్పటికీ, వన్ డే ఫార్మాట్ లో వారు ఎప్పుడు సమిష్టతో విజయాలను అందుకుంటారు. రవీంద్ర, ఫిలిప్స్ మరియు సాంట్నర్ వంటి వారు తమ బ్యాట్ తో మరియు బాల్ తో సమంగా రాణిస్తారు. యంగ్, కేన్, మిచెల్, లతాం వంటి బ్యాటర్లు మరియు హెన్రీ వంటి సీనియర్ బౌలర్ తో న్యూజిలాండ్ జట్టు మంచి పటిష్టంగా కనిపిస్తుంది.

ఇక ఇప్పటికే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ లో ఒకసారి న్యూజిలాండ్ ను ఎదుర్కున్న భారత్, ఆ మ్యాచ్ లో మంచి విజయం సొంతం చేసుకున్నప్పటికీ, ఆ విజయం అంత తేలికగా దరి చేరలేదు. ఆ మ్యాచ్ ను టీం ఇండియా చెమటోడ్చి గెలుచుకున్నారు. కానీ, ఒకసారి ఓడిన జట్టు ఎప్పటికైనా ప్రమాదమే. పైగా, ఆ మ్యాచ్ కూడా ఇదే గ్రౌండ్ లో జరగటం ఆ జట్టుకు సానుకూలంగా మారవచ్చు.

Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?


ఇప్పటికే 2000 సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ పై 4 వికెట్ల తేడాతో గెలిచారు న్యూజిలాండ్. 2019 వరల్డ్-కప్ సెమీస్ లోను భారత్ అభిమానుల ఆశల మీద నీళ్లుజల్లారు న్యూజిలాండ్ ఆటగాళ్లు. ఇక 2021 టెస్ట్ ఛాంపియన్షిప్ లో సైతం మనపై ఈ జట్టు ఆధిపత్యమే నెగ్గింది. దీనితో న్యూజిలాండ్ టీం పై భారత్ అభిమానులు ప్రతీకార వాంఛతో రగిలిపోతూ, అందుకు వారు ప్రతిగా ఈసారి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ను నెగ్గుస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.