ఫైనల్ డే ‘కిక్’ ఏ విధంగా ఉంటుందో..!

India Vs West Indies 2016, India Vs West Indies 2016 Test Match, India Vs West Indies 2016 Day 4 Test Match, Team India Vs West Indies 2016 Day 4 Test Matchవెస్టీండీస్ తో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా విజయం దోబూచులాడుతోంది. మూడవ రోజు నుండి మొదలైన వరుణుడు అడ్డంకి, నాలుగవ రోజు తారాస్థాయికి చేరడంతో, విండీస్ జట్టు ఊపిరి పీల్చుకుంది. అయితే మధ్య మధ్యలో రోజు మొత్తం మీద టీమిండియా బౌలర్లు వేసిన 15.5 ఓవర్లలో 4 వికెట్లు పడగట్టి భారత బౌలర్లు తమ సత్తా చాటారు. తొలి వికెట్ ను 3వ ఓవర్లోనే ఇషాంత్ శర్మ పడగొట్టగా, క్రీజులో నిలదొక్కుకున్నారని భావిస్తున్న తరుణంలో బ్రాత్ వెయిట్ ని అవుట్ స్పిన్నర్ మిశ్రా బోల్తా కొట్టించడంతో మళ్ళీ వికెట్ల పతనం ప్రారంభమైంది.

ADVERTISEMENT

ఆ తదుపరి ఓవర్లో షమీ శామ్యూల్స్ ని క్లీన్ బౌల్డ్ చేయగా, షార్ట్ పిచ్ బంతితో బ్రావోని కూడా బోల్తా కొట్టించి విండీస్ పతనాన్ని శాశించే విధంగా ఉన్నాడు. అయితే బ్రావో ఔటైన తర్వాత మళ్ళీ వర్షం ప్రారంభం కావడంతో నాలుగవ రోజు ఆటను ముగించారు. మ్యాచ్ లో ఒకరోజు మిగిలి ఉండగా, టీమిండియా విజయానికి 6 వికెట్లు కావాలి. మరి వరుణుడు సహకరిస్తే భారత విజయం అడ్డుకోవడం విండీస్ బ్యాట్స్ మెన్ల వల్ల కాకపోవచ్చు. అదే జరిగితే 4 టెస్టుల సిరీస్ లో 2-0తో టీమిండియా ఆధిక్యం ప్రదర్శించినట్లే!

ఓ పక్కన వర్షం… మరో పక్కన వికెట్ల పతనంతో ముగిసిన నాలుగవ రోజు విజయం ఆశలు పెంచిన నేపధ్యంలో… మరి ఫైనల్ డే ‘కిక్’ ఏ విధంగా ఉంటుందోనని వేచిచూడడం క్రీడాభిమానుల వంతయ్యింది.

ADVERTISEMENT
Latest Stories