Indian Stock Markets

ఇండియన్ స్టాక్ మార్కెట్ లో బుల్ జోరు మొదలైనట్టేనా.? ఇక నష్టాలకు ఫుల్ స్టాప్ పడినట్టేనా.? ఇన్వెస్టర్లు సేఫ్ నా.? ఇక నుంచి దేశీయ మర్కెట్లు నిలకడగా రాణిస్తాయా.? అనే ప్రశ్నలు ఇన్వెస్టర్ల మెదడును తొలిచేస్తున్నాయి.

రికార్డు స్థాయిలో గత ఐదు నెలలుగా వరుస నష్టాల బాట పట్టిన దేశీయ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యి ప్రస్తుతానికి నిఫ్టీ 22323 వద్ద ట్రేడ్ అవుతూ 240 పాయింట్స్ లాభాలతో దూసుకుపోతుంది. అలాగే సెన్సెక్స్ 73700 వద్ద ట్రేడ్ అవుతూ సుమారు 710 పాయింట్ల దిశగా పైకి ఎగబాకుతుంది.

Also Read – మంచు ఫ్యామిలీ వార్: ఇక్కడ కూడానా…?

దీనితో ఈ లాభాలు అనేది తాత్కాలిక ఉపశమనమా.? లేక ఇక్కడితో నష్టాలకు ఫుల్ స్టాప్ పడినట్టేనా.? అనే మీమాంశలో ఉన్నారు ట్రేడర్స్. అయితే భారతీయ మార్కెట్లలో అన్ని రంగాల విభాగాల షేర్లు కరెక్షన్ దిశగా పతనమవ్వడంతో మంచి కంపనీల షేర్లు కూడా అతి తక్కువ ధరలతో ట్రేడ్ అవుతూ అందరికి అందుబాటులోకి వచ్చాయి.

దీనితో ఇక మార్కెట్ లో ఫుల్ బ్యాక్ మొదలయ్యింది, చోటా, బడా ఇన్వెస్టర్లు కూడా ఆయా కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దాని ప్రభావంతోనే మార్కెట్లు ఆశాజనకంగా సాగుతున్నాయి అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అలాగే 2024 సెప్టెంబర్ నెలలో మొదలైన ఈ ఎరుపు చిత్రానికి అనేక కారణాలను విశ్లేషిస్తున్నారు ట్రేడ్ వర్గాలు.

Also Read – వాళ్ళు పొట్టి శ్రీరాములుని వద్దనుకున్నారు కానీ మనం..

వాటిలో ప్రముఖంగా ఫారెన్ ఇన్వెస్టర్స్ అమ్మకాల బాట పట్టడం, అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా లేకపోవడం, నిఫ్టీ ఆల్ టైం హైస్ ను తాకడం దానికి తోడు అమెరికా కొత్త అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ టారిఫ్ నిర్ణయాలు, అనాలోచిత ప్రకటనలు స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తూ కోలుకొని దెబ్బ తీసినట్టుగా విశ్లేషిస్తున్నారు.

అయితే భారీ నష్టాల నుంచి కాస్త ఉపశమనం దిశగా మార్కెట్లు పయనిస్తున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నప్పిటికి ఇంకా ఇన్వెస్టర్లు అయోమయంలోనే కొనసాగుతున్నారు. గత రెండు రోజుల నుంచి వారి భయాలకు భరోసా ఇచ్చేలా మార్కెట్లు గ్రీన్ బాట పట్టాయి. దీనితో ట్రేడ్ విశ్లేషకుల విశ్లేషణల ప్రకారం నిఫ్టీ 22 వేల మార్కును తాకిన తరువాత బోటంఅవుట్ గా పేర్కొంటూ ఇక ఇక్కడి నుంచి మార్కెట్లు తిరిగి పుంజుకునే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు.

Also Read – పోసాని కి దక్కని జగన్ ఓదార్పు…వై.?


మరికొంత మంది ఇది కేవలం రీప్లేసెమెంట్ మాత్రమే అని, రానున్న రోజులలో నిఫ్టీ మరింత కిందకు పోయే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు. మరి ఎవరి అంచనాలను నిజం చేస్తూ మార్కెట్లు మదుపరులకు లాభాలను రుచి చూపిస్తాయో.? లేక అవే నష్టాలను కొనసాగిస్తూ మరికొంతకాలం భయపెడతాయా.? అనేది చూడాలి. అయితే ఏది ఏమైనా ఇప్పుడు అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు ట్రంప్ టారిఫ్ నిర్ణయాలతో బెంబేలెత్తుతున్నాయన్న మాట మాత్రం ముమ్మాటికీ వాస్తవం.