ఐపీఎల్ 2025: నిరవధిక వాయిదా..!

IPL 2025 Postponed Indefinitely: BCCI

ఆసక్తిగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18 వ సీజన్ అనూహ్యంగా నిరవధిక వాయిదా పడింది. పాక్ – భారత్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఈ సీజన్ ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. రెండు దేశాల మధ్య నెలకొన్న విపత్కర పరిస్థితులలో మ్యాచ్ లను కొనసాగించడం అంటే అది భద్రతా పరంగా కత్తిమీద సాము వంటిదే అవుతుంది.

నిన్న ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ ను సైతం భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు రద్దు చేసారు. ఇక ముందు జరగబోయే మ్యాచ్ లలో సైతం ఈ సమస్య వెంటాడుతూనే ఉంటున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. అలాగే ఇటు దేశం మొత్తం పాక్ చర్యలతో, ఉగ్రమూకల దాడులతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్న వేళ ఐపీఎల్ నిరవిధిక వాయిదా నిర్ణయం మంచిదే అనే అభిప్రాయం వినపడుతుంది.

ADVERTISEMENT

ఇటు దేశ, విదేశాల నుంచి ఐపీఎల్ కోసం వచ్చిన ఆటగాళ్ల భద్రతతో పాటుగా, ఆటను చూడడనికి స్టేడియం కు వచ్చే వేలాదిమంది పౌరుల రక్షణ ప్రభుత్వాల బాధ్యత. ఇటువంటి సమయంలో ఆటల కోసమో, వినోదాల కోసం ముందుకెళ్లడం ప్రత్యర్థులకు అవకాశాలను ఇచ్చినట్టే అవుతుంది.

అయితే గతంలో కరోనా సమయంలో కూడా ఐపీఎల్ మ్యాచ్ లను భారత్ కు బదులుగా ‘యు.ఏ.ఈ’ కి మార్చిన విషయం తెలిసిందే. అలాగే, జెనరల్ ఎలెక్షన్స్ రిత్యా 2009 లో కూడా ఐపీఎల్ వెన్యూ ను మార్చడం జరిగింది. ఆ ఏడు ఐపీఎల్ ను సౌత్ ఆఫ్రికా లో నిర్వహించారు. రిపోర్ట్స్ ప్రకారం, ఈ సంవత్సరం కూడా ఐపీఎల్ ను మళ్ళీ సౌత్ ఆఫ్రికా వేదికగా నిర్వహించవచ్చని తెలుస్తుంది.

అయితే ఒకవేళ ఐపీఎల్ 18 సీజన్ కు ఇక్కడితో ముగింపు పలికినట్టయితే ఐపీఎల్ విజేతగా ఏ జట్టు ఐపీఎల్ కప్పును అందుకోనుంది అనే దాని మీద కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇక తమ 17 ఏళ్ళ నిరీక్షణకు ముగింపు పలకబోతున్నారా అన్నట్టుగా ఈ సీజన్ మొదటి నుంచి నిలకడగ రాణిస్తూ పాయింట్ పట్టికలో మొదటి స్థానానికి చేరింది RCB.

అటు కోహ్లీ కూడా ఓరేంజ్ క్యాప్ రేసులో ఉంటూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు మంచి పోటీ ఇస్తున్నారు. ఈ తరుణంలో ఈ సాల కప్ నందే అంటూ ఉర్రుతలూగుతున్న RCB అభిమానులకు ఇది ఒక ఊహించని పరిణామమనే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories