IPL Jagan

ఎప్పుడూ లేనంత చప్పగా 2024 ఐపీఎల్ ఫైనల్ మిగలడంతో క్రికెట్ ప్రేమికులంతా ఒక రకమైన షాక్ లో ఉన్నారు. అందులోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్ లో గెలుస్తుందన్న ఆశతో ఉన్న తెలుగు అభిమానులైతే తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

దీంతో ఎస్.ఆర్.హెచ్. ఓటమి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇది కాస్త అటు ఇటు చేరి వేణు స్వామి మరోసారి హైలైట్ గా నిలిచారు. వేణు స్వామి పేరు బయటకు రావడంతో, ఆటోమేటిక్ గా మరోసారి జగన్ మోహన్ రెడ్డి పేరు కూడా హల్చల్ చేస్తోంది.

Also Read – వైసీపీ రాజీనామాలు.. టీడీపీకి నష్టమే?

కావ్య మారన్ జాతకం ప్రకారం ఈ ఏడాది ఐపీఎల్ కప్ గెలిచేది హైదరాబాద్ జట్టేనని, తాను ఒక్కసారి చెప్తే అది 100 శాతం జరిగి తీరుతుందన్న వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ ప్రారంభమైంది.

ఐపీఎల్ ఫైనల్ ఇవ్వలేని ఫైనల్ కిక్కు, ఈ ట్రోలింగ్ తో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. గతంలో ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందని, తెలంగాణాలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఇదే వేణు స్వామి చెప్పిన వైనం తెలిసిందే.

Also Read – పథకాలు ప్రభుత్వానికి భారాలు…ప్రజలకు బాదుడు..!

అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలో కూడా వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాకు ఆహారమైన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ జట్టును కావ్య మారన్ జాతకంతో పోల్చి చేసిన వ్యాఖ్యలు సందడి చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే మరో వారం రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు తేలబోతున్న నేపథ్యంలో… జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయి తీరతారు అంటూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలకు ఎంత ప్రాధాన్యత దక్కిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Also Read – జగన్‌ రాజకీయాల స్టైలే వేరబ్బా!

ఫైనల్ గా చెప్పొచ్చేది ఏమిటంటే… ఇలా జాతకాలు చెప్పే వారిని నమ్మి, పూర్తిగా విశ్వసించే కంటే కష్టాన్ని నమ్ముకుని ప్రయత్నం చేయడం ఉత్తమం. అలాగే తాను చెప్పింది నూటికి నూరు శాతం జరిగి తీరుతుందని చెప్పకుండా ఇలా దారుణమైన ట్రోలింగ్ కు గురి కాకుండా ఉంటారు కదా!