
ఆమాద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ మంచివారేనా? నిజాయితీ పరుడేనా? ఆయన పాలన బాగానే ఉందా? అనే ప్రశ్నలకు ఢిల్లీ ప్రజలు ఫిబ్రవరి 5న జరుగబోతున్న శాసనసభ ఎన్నికలలో సమాధానం చెపుతారు. ఫిబ్రవరి 8న వారి తీర్పు తెలుస్తుంది.
Also Read – కర్నూలు హైకోర్టు బెంచ్‌కి తొలి విగ్నం.. వాళ్ళేనా?
కానీ ఇవే ప్రశ్నలు రాజకీయ పార్టీలను అడిగితే వేర్వేరు సమాధానాలు వస్తాయి. ఆమాద్మీ పార్టీని ఎలాగైనా గద్దె దించి అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడుతున్న బీజేపి పెద్దలు, మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారని వాదిస్తున్నారు. ఆ కేసులో జైలుకి కూడా పంపారు.
ఢిల్లీని 15 ఏళ్ళు ఏకధాటిగా పాలించిన కాంగ్రెస్ పార్టీ, బీజేపిని అడ్డుకునేందుకు మొదట్లో ఆమాద్మీ పార్టీతో చేతులు కలిపినా తర్వాత విడిపోయింది. గత పదేళ్ళుగా ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారం చేజిక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది కానీ ఫలించడం లేదు. మళ్ళీ ఇప్పుడు మరోసారి గట్టిగా ప్రయత్నిస్తోంది.
Also Read – వంశీ జైలుకి… వైసీపీ కార్యకర్తలు సైలంట్?
కాంగ్రెస్ పార్టీ తరపున ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, లిక్కర్ స్కామ్ ప్రస్తావన చేస్తూ, ఈ అవినీతిలో భాగస్వామి అయిన బిఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఓడించి గద్దె దించామని, అలాగే ఢిల్లీ ప్రజలు కూడా ఆవినీతిపరుడైన అరవింద్ కేజ్రీవాల్‌ని, ఆమాద్మీ పార్టీని వదిలించుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో తిరుగేలేదనుకున్న తమని రేవంత్ రెడ్డి ఓడించి మూల కూర్చోపెట్టడంతో కేటీఆర్ రగిలిపోతున్నారు. ఇప్పుడు ఎఫ్-1 రేసింగ్ కేసులో ఉచ్చు బిగుసుకుంటుండంతో రేవంత్ రెడ్డిపై ఇంకా రగిలిపోతున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి లిక్కర్ స్కామ్ ప్రస్తావన చేస్తూ తమ గురించి మాట్లాడటంతో భగ్గుమన్నారు.
Also Read – అందరికీ ఓ రెడ్‌బుక్ కావాలి.. తప్పు కాదా?
తెలంగాణలో హామీలు అమలుచేయకుండా మోసం చేసిన రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రజల చెవుల్లో క్యాబేజీ పూవులు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీజేపిల దృష్టిలో అరవింద్ కేజ్రీవాల్ అవినీతిపరుడు. కానీ ఆయన అవినీతిపరుడని బిఆర్ఎస్ పార్టీ అంగీకరించలేదు. అంగీకరిస్తే కల్వకుంట్ల కవిత కూడా అవినీతికి పాల్పడిన్నట్లు ఒప్పుకున్నట్లే. కనుకనే కేసీఆర్ మొదటి నుంచి అరవింద్ కేజ్రీవాల్‌ని వెనకేసుకువస్తున్నారు.
అంటే ఓ రాజకీయ నాయకుడు అవినీతిపరుడో కాదో ఆ కేసుని బట్టి గాక, ఆయా రాజకీయ పార్టీల మద్య సంబంధాలు, శతృత్వాలు, పొత్తులు, లెక్కలు, అవసరాలను బట్టి మారిపోతుందన్న మాట!