రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలిచేందుకు హామీలు ప్రకటించి గెలిచి అధికారంలోకి వచ్చేక వాటిని అమలుచేస్తుంటాయి. కానీ అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం దేశంలో వైసీపీ మాత్రమే. ఇంత దూరదృష్టి ఉన్న వైసీపీ ప్రభుత్వానికి సంక్షేమ పధకాల కోసం అప్పులు చేసుకొంటూపోతే చివరికి రాష్ట్రం ఏమవుతుంది అనే ఆలోచనలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
వైసీపీ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేకపోయినా ఎక్కడి నుంచి ఏవిదంగా డబ్బులు రాల్చుకోవచ్చనే తెలివితేటలు చూసి కేంద్ర ప్రభుత్వమే షాక్ అవుతోంది. ఓ పక్క అప్పుల కుప్పలు పేరుకుపోతుంటే, కేంద్రం నుంచి వివిద పధకాలకు, పనులకు వస్తున్న నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించేస్తోంది.
పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించేస్తోందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, పంచాయతీల పేరిట బ్యాంక్ ఖాతాలు తెరిపించి వాటిలోనే నిధులు జమా చేయాలనుకొంది. కానీ వాటిలో నిధులు జమాకాక మునుపే వైసీపీ ప్రభుత్వం బ్యాంకుల నుంచి లాగేస్తోంది. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను కరెంటు బాకీల కింద జమా చేసేందుకు రంగం సిద్దం చేసింది.
అంతకు ముందు వైసీపీ ప్రభుత్వం పంటల మార్కెట్ ఫీజులు పెంచి దానిని అదనపు ఆదాయంగా చూపుతూ మార్క్ ఫెడ్ ద్వారా రూ.1,700 కోట్లు అప్పు తెచ్చింది. దానికంటే ముందు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్‌కు రాబోయే ఆదాయాన్ని చూపి రుణాలు తీసుకొంది.
రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ కూడా శ్రీలంకలా దివాళా తీసే ప్రమాదం కనిపిస్తోంది. రాష్ట్రంతో పాటు వైసీపీ ప్రభుత్వానికి సహకరిస్తున్న బ్యాంకులు కూడా మునిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. అందుకే కేంద్ర ఆర్ధికశాఖ, రిజర్వ్ బ్యాంక్ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. చివరికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమవుతుందో?రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయినా చెప్పగలరో లేదో?
Watch and subscribe for Exclusive Interviews:



