ఐదేళ్ళపాటు రాక్షస పాలన అంటే ఎలా ఉంటుందో ప్రజలకు, ప్రతిపక్షాలకు రుచి చూపించిన జగన్, సుపరిపాలన, విలువలు, విశ్వసనీయత అంటూ మాట్లాడుతుంటే భారత్‌పై ఉగ్రదాడులు చేయించి నీతులు చెపుతున్న పాక్ పాలకుల మాటల్లా అనిపిస్తుంది.
జగన్‌కి ప్రాణభయం చాలా ఎక్కువని అధికారంలో ఉన్నప్పుడే బయటపెట్టుకున్నారు. ఆ భయంతోనే నేటికీ ప్రజల మద్యకు వచ్చేందుకు భయపడుతున్నారు. కనుక పార్టీ నేతలనే తాడేపల్లి ప్యాలస్‌కు పిలిపించుకొని సమావేశాలు నిర్వహిస్తున్నారు.
కానీ పార్టీ నేతలని పిలిపించుకొని రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని జగన్ చెపుతుండటం చూస్తున్నప్పుడు, ఇంతకీ ఆయన వారికి దిశానిర్దేశం చేసేందుకు పిలిపించుకున్నారా లేక తన అభద్రతాభావాన్ని, మనసులో చెలరేగుతున్న భయాందోళనలను వారికి మొరపెట్టుకునేందుకు పిలిపించారా? లేదా నేటికీ పార్టీలో అందరూ తన వెంట ఉన్నారో లేదో ఎప్పటికప్పుడు పరీక్షించుకునేందుకు సమావేశాల పేరుతో తన వద్దకు పిలిపించుకుంటున్నారా?అనే సందేహం కలుగుతుంది.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యం చేస్తూ 175కి 175 మనవే అని పార్టీలో అందరి కళ్ళకు గంతలు కట్టి గోతిలో పడేశారు. ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు కారణమని చెప్పి ఓటమి బాధ్యతని స్వీకరించకుండా తప్పించుకున్నారు.
ఇప్పుడు ఈ కేసులు, అరెస్టులు, ఒత్తిళ్ళ కారణంగా పార్టీ క్యాడర్ చెల్లాచెదురు అయిపోతే, రాష్ట్ర రాజకీయాలలో తాను ఒంటరిగా మిగిలిపోతానేమోననే భయం జగన్‌లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ భయంతో జగన్ తననే నమ్ముకున్న కార్యకర్తలని, నేతలని ఈవిదంగా భ్రమలో ఉంచాలనుకోవడం చాలా దారుణం.
పార్టీ నేతలు, కార్యకర్తలఆత్మవిశ్వాసం నింపాల్సిన జగన్, వారిని రాష్ట్రంలో వాస్తవ రాజకీయ పరిస్థితులను గమనించకుండా కళ్ళకు గంతలు కట్టి ఇటువంటి మాటలతో వారిని హిప్నటైజ్ లేదా బ్రెయిన్ వాష్ చేస్తున్నారా?అని సందేహం కలుగుతుంది.
కానీ జగన్ చేత కళ్ళకు గంతలు కట్టించుకొని, బ్రెయిన్ వాష్ చేయించుకునేందుకు వైసీపీలకు అభ్యంతరం లేకపోతే అది వారి ఖర్మ అనుకోక తప్పదు.
జగన్ ఈవిదంగా మానసిక భయాందోళనలతో జీవిస్తూ, తాను స్వయంగా ఎంతో కష్టపడి నిర్మించుకున్న వైసీపీని భస్మాసురుడిలా నాశనం చేసుకోబోతున్నారా?అనే సందేహం కలుగుతుంది.
కానీ జగన్ అదృష్టం ఏమిటంటే నేటికీ ఆయన వెంట బలమైన క్యాడర్, నేతలు ఉన్నారు. వారికున్న విలువలు, విశ్వసనీయత జగన్‌కు లేకపోవడమే విచిత్రం. లేకపోయినా వాటి గురించి పదేపదే మాట్లాడుతుండటం ఇంకా విచిత్రం.. కదా?






