Is Kodali Nani Chapter Started?

తెలుగుదేశం, జనసేన పార్టీలు మాత్రమే కాదు వైసీపీ నేతలతో సహా ఆంధ్రా ప్రజలందరూ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కేసుల అధ్యాయం ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకో అందరికీ తెలుసు. వైసీపీలో జగన్‌ అండ చూసుకొని అన్ని లిమిట్స్ క్రాస్ చేసిన కొద్ది మంది నేతలలో కొడాలి నాని మొట్ట మొదటి స్థానంలో ఉన్నారు కనుక!

అసలు ఆయన వల్లనే నారా లోకేష్‌ ‘రెడ్ బుక్’ వ్రాయడం మొదలుపెట్టారనే టాక్ విన్పిస్తుంటుంది. కనుక గుడివాడ పట్టణంలో ‘అంకుశం సినిమా సీన్’ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read – యాదగిరిగుట్టకు ఓ బోర్డు… అవసరమా?

కానీ కూటమి ప్రభుత్వం పోసాని, వర్మ, గోరంట్ల, వంశీ, దువ్వాడ వంటివారితోనే ఇంకా కాలక్షేపం చేస్తోంది తప్ప కొడాలి నాని వైపు చూడటమే లేదు. దీంతో సూపర్ హిట్ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు, టీడీపీ, జనసేన, గుడివాడ పట్టణంలో కొడాలి బాధితులు కొడాలి చాప్టర్ ఇంకా ఎప్పుడు మొదలవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

గుడివాడ పోలీసులు ఈరోజు కొడాలి నాని అంచరులు గొర్ల శ్రీను, దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్‌లకు సెక్షన్ 41 ఏ కింద నోటీసులు ఇచ్చారు.

Also Read – మీరు ఎమ్మెల్యేలయ్యా… దొంగలుకారు!

కొడాలి నాని ఆదేశం మేరకు వారు ఎన్నికలకు ముందు వాలంటీర్ల చేత బలవంతంగా రాజీనామాలు చేయించినందుకు, లిక్కర్ గోదాం కేసులో వారికి నోటీసులు పంపారు.




ఈ రెండు కేసులలో కనుక రెడ్ బుక్‌లో కొడాలి నాని, బేవారేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, జేసీ మాధవీలత రెడ్డి ముగ్గురిపై ఇదివరకే కేసు నమోదైంది. కనుక రెడ్ బుక్‌లో కొడాలి చాప్టర్ మొదలైన్నట్లే భావించవచ్చు.

Also Read – జగన్‌ పొమ్మన్నారు బాబు రమ్మన్నారు.. అశోక్ లేలాండ్‌ని