ఆత్మసాక్షి చెప్పేసిందిగా వైఎస్ షర్మిల గురించి!

Ys Sharmilaజగనన్న ఏపీలో ఆడపడుచులందరికీ అన్న కావచ్చునేమో కానీ సొంత చెల్లి వైఎస్ షర్మిలకు కాదు. కనుకనే ఆమె తెలంగాణకు పోయి అక్కడ సొంత కుంపటి పెట్టుకొన్నారు. ఆమె కూడా తండ్రి పేరు చెప్పుకొని ప్రజలకు చేరువయ్యి, రాజకీయంగా ఎదగాలని విశ్వప్రయత్నాలు చేశారు. కానీ తెలంగాణలో ఆమెకు చోటు అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో చెప్పేశాయి. ఈ పరిస్థితులలో ఆమెకు ‘కాంగ్రెస్‌ లాటరీ’ తగిలింది.

వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ఢిల్లీ నుంచి ఆమెకు కబురు వచ్చింది. ఆ తర్వాత ఆమె రెండుసార్లు బెంగళూరు వెళ్ళి కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డికె శివకుమార్‌తో భేటీ అయ్యారు. రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. పాదయాత్రలో అలిసిన సీనియర్ కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్కకు ఫోన్‌ చేసి పరామర్శించారు కూడా. ఇవన్నీ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇస్తున సిగ్నల్స్ అని అర్దమవుతూనే ఉన్నాయి.

ADVERTISEMENT

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా విలీనం ఖాయమని చెప్పేశారు. అయితే ‘ఇక్కడ కాదు… ఏపీ కాంగ్రెస్‌లో’ అంటూ మరో చిన్న ముక్క కూడా చెప్పారు.

దీనిని జగనన్న మనసాక్షి కూడా ధృవీకరిస్తూ “తెలంగాణ కాంగ్రెస్‌కు టైమొచ్చిందా?” అనే శీర్షికతో ఈరోజు ఓ కధనం ప్రచురించింది. దానిలో పొంగులేటి, జూపల్లి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదిర పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, వైఎస్ షర్మిల కాంగ్రెస్‌ పార్టీతో పొత్తులు పెట్టుకోబోతున్నారని పేర్కొంది.

ఒకవేళ ఆమె ఏపీ కాంగ్రెస్‌లో చేరితే జగనన్నకు, వైసీపీకి పక్కలో బల్లెంలా గుచ్చుకొంటూనే ఉంటుంది. పైగా ఆమె జగనన్న ప్రభుత్వం మీద విమర్శలు, ఆరోపణలు చేస్తే వైసీపీ గ్రాఫ్ వేగంగా పడిపోతుంది. కనుక ఆమె స్థానం అక్కడే అన్నట్లు ఆత్మసాక్షి సూచించింది.

అయితే వైసీపీ కోరుకొన్నట్లుగా ప్రతిపక్షాలు నడుచుకోవాలంటే కుదరదు కదా? జూలై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ సమక్షంలో ఇడుపులపాయలో వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నట్లు తాజా సమాచారం. కనుక చెల్లెమ్మకు స్వాగతం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు సిద్దంగా ఉండటం అవసరం.

ADVERTISEMENT
Latest Stories