దేశం ‘మీసం’ తిప్పే సమయం!

ISRO  ISRO   India  satellite navigation system Launchఅగ్ర రాజ్యాలు కూడా సాహసించని గొప్ప ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఏకంగా 104 ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా నింగిలోకి పంపేందుకు సర్వం సిద్ధమయింది. పీఎస్ఎల్వీ-సీ37 ద్వారా ఈ ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం ద్వారా మన దేశానికి చెందిన కార్బోశాట్-2, ఐఎన్ఎస్-1ఏ, ఐఎన్ఎస్-2ఏ ఉపగ్రహాలతో పాటు అమెరికాకు చెందిన 96 ఉపగ్రహాలు, స్విట్జర్లాండ్, కజకిస్థాన్, యూఏఈకి చెందిన ఐదు ఉపగ్రహాలను ఇస్రో నింగిలో ప్రవేశపెట్టనుంది.

ADVERTISEMENT

మంగళవారం తెల్లవారుజామున 5.28 గంటలకు ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. మొత్తం 28 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగనుంది. బుధవారం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ-సీ37 నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకుపోనుంది. ఈ ప్రయోగం నేపథ్యంలో, ప్రపంచ దేశాలన్నీ శ్రీహరి కోటలోని షార్ కేంద్రపై దృష్టిని సారించాయి. ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా… ఒకేసారి 104 ఉపగ్రహాలను భారత్ విజయవంతంగా ప్రయోగించగలదా? అని అన్ని దేశాలు ఎదురుచూస్తున్నాయి.

ఈ పరీక్ష విజయవంతమైతే, స్పేస్ టెక్నాలజీలో ఇస్రో ఖ్యాతి దశదిశలా వ్యాపిస్తుంది. అమెరికా, రష్యా, చైనా, యూరోపియన్ యూనియన్ కు సైతం సాధ్యం కాని విజయాన్ని సొంతం చేసుకున్నట్లవుతుంది. ఇస్రో మన దేశం మీసం తిప్పాలని ప్రతి భారతీయుడు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా ఆకాంక్షిద్దాం.

ADVERTISEMENT
Latest Stories