ISRO Own Space Station in Space

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 22 ఏళ్ళ తర్వాత 1969, ఆగస్ట్ 15న భారత్‌ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు అమెరికా తదితర అగ్రరాజ్యాల పత్రికలు ‘తిండికి గతిలేని భారత్‌కు అంతరిక్ష ప్రయోగాలు అవసరమా?’ అంటూ ఎగతాళి చేసేవి.

ఎద్దుల బండిపై ఉపగ్రహాలను తరలిస్తున్న చిత్రాలతో కార్టూన్స్ వేసి, ‘వాటిని అంతరిక్షంలోకి పంపిస్తారట,’ అని జోకులు వేసుకొని పగలబడి నవ్వుకునేవారు.

Also Read – ప్రభుత్వంపై ఆధారపడమంటారు జగన్‌.. వద్దంటారు చంద్రబాబు!

అంతే తప్ప అటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా ఇస్రో శాస్త్రవేత్తలు నమ్మకం, పట్టుదల కోల్పోలేదని అగ్రదేశాలు గుర్తించలేకపోయాయి. అప్పుడు ఇస్రోని ఎగతాళి చేసిన అగ్రరాజ్యలే ఇప్పుడు తమ ఉపగ్రహాలను ఇస్రో ద్వారా అంతరిక్షంలోకి పంపించుకుంటున్నాయి. ఇప్పుడు ఇస్రో కొత్తగా ఏం చేయబోతోంది? అని ఎదురుచూస్తున్నాయి కూడా.

ఈ 55 ఏళ్ళ ఇస్రో ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు అదిగమించింది. తాజాగా అంతరిక్షంలో రెండు ఉప గ్రహాలను విజయవంతంగా అనుసంధానించింది. ఇంతవరకు ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా మూడు దేశాలు మాత్రమే ‘శాటిలైట్ డాకింగ్’ చేయగలిగాయి. ఇప్పుడు వాటి సరసన భారత్‌ని కూడా నిలిపింది ఇస్రో!

Also Read – వివేకా హత్యతో సంబందం లేకపోతే భయం దేనికి?

శ్రీహరికోట నుంచి డిసెంబర్‌ 30న స్పెడెక్స్-1 ఏ, 1బి అనే రెండు ఉప గ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. అంతరిక్షంలో వాటిని కలిపేందుకు ఇస్రో మూడుసార్లు ప్రయత్నించింది కానీ సాంకేతిక కారణాల వలన సాధ్యపడలేదు.




ఈరోజు వాటి మద్య దూరాన్ని మూడు మీటర్లకు తగ్గించి మెల్లగా అనుసంధానించారు. ఈ నూతన సంవత్సరం ప్రారంభంలోనే ఇస్రో ఇటువంటి క్లిష్టమైన ప్రక్రియని విజయవంతంగా చేయడం యావత్ భారతీయులకు గర్వకారణమే. అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటుచేసుకోవాలనే ఇస్రో ప్రయత్నాలలో ఇది తొలి అడుగు అని చెప్పవచ్చు.

Also Read – ఆప్ ఓటమికి బిఆర్ఎస్ స్కాములే కారణమా..?