జగన్ 2.0…కార్యకర్తల కోసమా.?

Jagan 2.0 politics

ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజల దగ్గరకెళ్ళి నేను అధికారంలోకి వస్తే మీ గ్రామ సమస్యలను తీరుస్తా, మీ నగర సుందరీకరణ చేస్తా, మీ పట్టణ అభివృద్ధికి ముందడుగు వేస్తా, ఈ రాష్ట్ర ప్రగతికి మార్గాలు వెతుకుతా అంటూ ఓటడుగుతారు.

కానీ వైసీపీ 2.0 అధికారంలోకి రావడానికి, జగన్ 2.0 గద్దెనెక్కడానికి జగన్ ప్రజలను పక్కన పెట్టి, రాష్ట్రాన్ని గాలికొదిలి కార్యకర్తల కోసం, తన ప్రభుత్వంలో వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వడం కోసం పాదయాత్ర చేసి మరి ప్రజలను ఓటడుగుతారంటా..!

ADVERTISEMENT

రాష్ట్రంలో సొంత పార్టీ క్యాడర్ కి తొలి ప్రాధాన్యత ఇవ్వడానికి జగన్ కి అధికారం కావాలా.? వారికి ఇచ్చిన ఈ హామీని నిలబెట్టుకోవడానికి రాష్ట్రంలో తిరిగి వైసీపీ 2.0 ఉండాలా.? నాడు ఇదే వైసీపీ క్యాడర్ ని వాలంటీర్లుగా మార్చి ప్రభుత్వంలో భాగం చేసి వై నాట్ 175 అంటూ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేశారు.

ఇక ఇప్పుడు జగన్ 2.0 పార్టీ కార్యకర్తల బాగు కోసమే అంటూ అదే పార్టీ క్యాడర్ ని నమ్మించడానికి సిద్ధమయ్యారు. అసలు జగన్ కి అధికారం దక్కాలన్నా, వైసీపీ కి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నా అదంతా ఓటర్ల చేతిలోనే ఉంటుంది కానీ వాలంటీర్ల జేబులోనో, కార్యకర్తల రప్ప రప్ప నినాదాలలో ఉండదు అనే వాస్తవాన్ని జగన్ ఒప్పుకోలేకపోతున్నారా.?

నాడు తన సాక్షి ఛానల్ ఉద్యోగులను తెచ్చి ప్రభుత్వ సలహాదారులు అంటూ ప్రజల సొమ్ముని దోచి పెట్టారు, ఇక పార్టీ క్యాడర్ ని తెచ్చి వాలంటీర్లు అంటూ వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసారు. అలాగే తన కేసులో ఏ2 గా ఉన్న నిందితులను తెచ్చి రాష్ట్రం మీద రుద్దారు, రాజ్యసభకు పంపారు.

ఇక బూతుల నేతలను మంత్రులను చేసారు, రాజకీయ దాడులకు పాల్పడ్డ నేతలకు పదవులను కట్టబెట్టారు, గంట అరగంట అంటూ ముచ్చట్లు పెట్టిన వారిని నెత్తిన పెట్టుకున్నారు, ఇక న్యూడ్ వీడియోలతో అడ్డంగా దొరికిన వారిని వెనకేసుకొచ్చారు.

ఇలా వైసీపీ 1.0 లో వైసీపీ ప్రభుత్వం మొత్తం విధ్వంశం వైపు అడుగులేసి, ఓటేసిన ప్రజలను పక్కన పెట్టి, గెలిపించిన కుటుంబాన్ని పక్కకు నెట్టి కేవలం టీడీపీ పతనం, జనసేన వినాశనం అన్నట్టుగా పాలన చేసిన జగన్ ఇప్పుడు పార్టీ క్యాడర్ కోసం వైసీపీ 2.0 అంటూ పాదయాత్రతో ప్రజల వద్దకు సిద్ధమవుతున్నారు. మరి జగన్ తన పార్టీ క్యాడర్ కి ఇచ్చిన హామీని నెగ్గించేందుకు ప్రజలు సిద్ధమా.?

ADVERTISEMENT
Latest Stories