
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షాలు తాను కోరుకున్నట్లే రాజకీయాలు చేసుకోవాలన్నట్లు మాట్లాడేవారు. టీడీపీతో జనసేన, ఆ రెండు బీజేపితో పొత్తులు పెట్టుకోకూడదు. పెట్టుకోవడం చాలా అనైతికం అని వాదించేవారు.
Also Read – పోసాని కి దక్కని జగన్ ఓదార్పు…వై.?
పొత్తులు పెట్టుకొని కలిసి పనిచేస్తున్న పార్టీలే ఏదో సందర్భంలో విభేదించుకుంటాయి. అటువంటప్పుడు తమకు సంబంధం లేని పార్టీ చెప్పిన మాట ఎందుకు వింటాయి? వినాలి? అని జగన్ ఆలోచించి ఉంటే ఆ విదంగా వితండవాదం చేసేవారే కారు.
జగన్ అప్పుడు అధికారంలో ఉన్నారు కనుక ఆయన ఏం మాట్లాడినా చెల్లేది. కానీ పదవి, అధికారం కోల్పోయిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం తనకు నచ్చిన్నట్లే, తన విధానాల ప్రకారమే పాలన చేయాలని కోరుకోవడం చాలా విడ్డూరంగా ఉంది.
Also Read – అందగాళ్ళ అరెస్టులు…సౌమ్యుల రాజీనామాలు..!
సంక్షేమ పధకాల డబ్బా కొట్టుకొని వాటిని చంద్రబాబు నాయుడు అమలుచేయకపోవడాన్ని తప్పు పడుతూ విమర్శిస్తుండ టమే ఇందుకు ఉదాహరణ.
అంటే కూటమి ప్రభుత్వం తాను కోరుకున్నట్లే పాలన చేయాలని, తన విధానాలనే తూచా తప్పకుండా పాటించాలని జగన్ చెపుతున్నట్లు భావించవచ్చు. లేకుంటే ప్రజలను మోసం చేయడమే అని జగన్ అండ్ కో ప్రకటించేస్తారు!
Also Read – సింహంలాంటి జగన్‌కి ఈ కష్టాలు ఏమిటో!
ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తుతం శాసనసభలో 2025-26 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ విలువ రూ. 3.22 లక్షల కోట్లు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రవేశ పెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. కనుక దీనిలో ప్రభుత్వ ప్రాధాన్యతలు, రాష్ట్ర అవసరాలు, ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేశారు.
అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ.48,000 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు, పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు కేటాయించారు.
ఆంధ్ర నీటి సమస్యలకు శాశ్విత పరిష్కారం చూపగల పోలవరానికి బడ్జెట్‌లో కేవలం రూ.6,705 కోట్లు మాత్రమే కేటాయించగా, దానికంటే మరో 2,702 కోట్లు అదనంగా అంటే రూ.9,407 కోట్లు తల్లికి వందనం పధకం కోసం కేటాయించారు.
ఇంచుమించు పోలవరంతో సమానంగా అన్నదాత సుఖీభవ పధకానికి రూ.6,300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. అంటే సూపర్ సిక్స్ హామీలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరూపించేందుకు ఇంతకంటే మంచి నిదర్శనం ఏముంటుంది?
కానీ అప్పుడే వైసీపీ సొంత మీడియా కూటమి ప్రభుత్వం సంక్షేమ పధకాలకు కోతలు అంటూ పాట మొదలుపెట్టేసింది.
శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రులు జవాబులు చెపుతారు. కానీ శాసనసభలో అడుగుపెట్టాలంటే సింగిల్ సింహం భయంతో వణికిపోతోంది. కనుక తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని సొంత మీడియాని ఎదురుగా పెట్టుకొని నోటికి వచ్చిన్నట్లు విమర్శలు చేస్తూ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేస్తుంటారు. శాసనసభకు రాని ఎమ్మెల్యే అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా?