Chandrababu Naidu Repairs

చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ముందుగా విద్యుత్ కొరత సమస్యలని తీర్చి రాష్ట్రానికి మిగులు విద్యుత్ సృష్టించేందుకు ప్రయత్నిస్తుంటారు.

రాష్ట్ర విభజన సమయానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో విపరీతమైన విద్యుత్ కొరత, ఆ కారణంగా విద్యుత్ కోతలు ఉండేవి. సామాన్య ప్రజలు మొదలు భారీ పరిశ్రమల వరకు విద్యుత్ కొరత, విద్యుత్ కోతలతో సతమతమవుతుండేవి.

Also Read – ఏపీకి పెట్టుబడుల ప్రవాహం… చాలా అవసరమే!

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 2014 లో బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించి కేవలం 6-7 నెలల్లోనే విద్యుత్ సమస్యలని పరిష్కరించి ఉపశమనం కలిగించారు.

వాటితో పాటు పాలనాపరమైన పలు సమస్యలు అంటే ప్రభుత్వోద్యోగులు అందరూ హైదరాబాద్‌లో ఉండటం, వారిని విజయవాడకి రప్పించడం, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఏర్పాటు వంటి క్లిష్టమైన సమస్యలన్నీటినీ చంద్రబాబు నాయుడు పరిష్కరించి రాష్ట్రాన్ని గాడిన పెట్టారు.

Also Read – జగన్‌ గుర్తించలేని మెగాస్టార్‌ని బ్రిటన్ గుర్తించింది!

అంటే జగన్‌కు వడ్డించిన విస్తరిలా రాష్ట్రాన్ని అందించారని చెప్పవచ్చు. కానీ జగన్‌ తుగ్లక్ పాలనతో వడ్డించిన ఆ విస్తరిని కుక్కలు చించిన విస్తరిలా మార్చేశారు.

విభజనతో దెబ్బ తిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం, పాడిపరిశ్రమ, ఆక్వా, గ్రానైట్, ట్రాన్స్‌పోర్టు, ఐటి వంటి కొన్ని రంగాలు గుండెకాయల మారాయి. జగన్‌ వాటన్నిటినీ కూడా భ్రష్టు పట్టించేశారు. ముఖ్యంగా విద్యుత్ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం, ఈ రంగాలపై అదనపు విద్యుత్ భారం మోపడంతో తీవ్రంగా నష్టపోయాయి.

Also Read – డీలిమిటేషన్‌: రాజకీయ లెక్కలు సరిచూసుకోవలసిందే!

దీంతో 5 ఏళ్ళ జగన్‌ పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. జగన్‌ హయంలోనే విద్యుత్ సమస్యలు మొదలయ్యాయి. కానీ ఓడిపోయి ఆ సమస్యల నుంచి తప్పించుకోగలిగారు. కనుక మళ్ళీ ఇప్పుడు అవన్నీ సిఎం చంద్రబాబు నాయుడు తలకే చుట్టుకున్నాయి.

అయితే సిఎం చంద్రబాబు నాయుడుకి ఇటువంటి సవాళ్ళు, సమస్యలు ఎదుర్కొని పరిష్కరించుకుంటూ, అన్నీ గాడిన పెట్టుకొని ముందుకు సాగడం అలవాటే.

కనుక విద్యుత్ సమస్యల పరిష్కారానికి మళ్ళీ నడుం బిగించారు. ఈసారి విద్యుత్ సమస్య, కొరత పరిష్కరిస్తే సరిపోదు.. రాష్ట్రానికి తప్పనిసరిగా మిగులు విద్యుత్ కూడా ఏర్పాటు చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించి, ధర్మల్ విద్యుత్‌కి అదనంగా హైడ్రో, సోలార్, విండ్ మిల్స్ ద్వారా 5,828 మెగావాట్స్ విద్యుత్ ఉత్పాదనకి అవసరమైన చర్యలు చేపట్టారు. వాటిలో భాగంగా…

· కడప-నంద్యాల జిల్లాలలో 300 మెగావాట్స్ సౌర విద్యుత్ ప్రాజెక్ట్.

· కడప-అనంతపురం జిల్లాలలో 300 మెగావాట్స్ సౌర విద్యుత్ ప్రాజెక్ట్.

· అన్నమ్మయ్య జిల్లాలో 2,000 మెగావాట్స్ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్.

· అనంతపురం జిల్లాలో 400 మెగావాట్స్ సౌర విద్యుత్ ప్రాజెక్ట్.

· అనంతపురం జిల్లాలో 178.20 మెగావాట్స్ పవన విద్యుత్ (విండ్ మిల్స్) ప్రాజెక్ట్.

· అనంతపురం-శ్రీసత్యసాయి జిల్లాలలో 118.80 మెగావాట్స్ పవన విద్యుత్ (విండ్ మిల్స్) ప్రాజెక్ట్.

· శ్రీ సత్యసాయి జిల్లాలో 231 మెగావాట్స్ పవన విద్యుత్ (విండ్ మిల్స్) ప్రాజెక్ట్.




· అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2,300 మెగావాట్స్ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయిస్తున్నారు.