ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి తమతమ రాష్ట్రాలకు సంబందించిన అంశాల గురించి చర్చించి వస్తుంటారు. ఇదివరకు జగన్ వెళ్ళేవారు.. ఇప్పుడు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళి వస్తున్నారు.
జగన్ ఢిల్లీ పర్యటనలు తన ఆక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసు, సంక్షేమ పధకాలకు అప్పుల కోసమే అని ఆనాడే మీడియా కోడై కూసేది. కానీ ఏనాడూ జగన్, వైసీపీ నేతలు, వారి స్వంత మీడియా పెద్దగా ఖండించింది లేదు! ఎందుకంటే అది వాస్తవమే కనుక.
Also Read – మంచులో కొట్లాటలు.. తీర్పులు అవసరమా?
జగన్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత కేంద్రం ఏపీకి కొత్తగా ఎంత అప్పు ఇవ్వబోతోందో ప్రకటిస్తుండేది తప్ప రాష్ట్రానికి సంబందించిన అంశాలపై ఎటువంటి ప్రకటన వెలువడేది కాదు.
ఒక్కోసారి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ దొరకనప్పుడు జగన్ సెల్లారులో తన కారులో ఓ గంట సేపు కాలక్షేపం చేసి తిరిగివచ్చేవారని, అప్పుడు సొంత మీడియాలో జగన్ ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి సంబందించిన అంశాలపై మాట్లాడి వచ్చారని వ్రాసుకునేదని ఓ సీనియర్ బీజేపి నేత బయటపెట్టారు.
Also Read – జగన్ చివరి ఆశ అదే?
ఆవిదంగా సొంత పనులపై ఢిల్లీ వెళ్ళి వస్తుండే జగన్, ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని కలిసి వస్తే, తన తమ్ముడు నాగబాబుకి రాజ్యసభ సీటు ఖరారు చేసుకోవడానికే వెళ్ళారని వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
నాగబాబుకి రాజ్యసభ సీటు ఇప్పించుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీ అనుమతి తీసుకోనవసరం లేదు… సిఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే చాలనే చిన్న విషయం తెలియన్నట్లు వైసీపీ దుష్ప్రచారం చేయడాన్ని అందరూ చూస్తూనే ఉన్నారు.
Also Read – కేసీఆర్ చరిత్రని రేవంత్ తుడిచేయగలరా?
వైసీపీ దుష్ప్రచారానికి జనసేన పార్టీ చెప్పుతో కొట్టిననట్లు జవాబు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఎవరెవరిని కలిశారో, కలిసి ఏమేమి మాట్లాడారో, ఆయన పర్యటన వలన రాష్ట్రానికి ఏమేమి ప్రయోజనాలు కలుగబోతున్నాయో వివరిస్తూ తమ సోషల్ మీడియాలో ఫోటోలతో సహా పూర్తి వివరాలు పోస్ట్ చేసింది.
నాగబాబు కూడా స్పందిస్తూ, తన సోదరుడు పవన్ కళ్యాణ్ నిస్వార్ధంగా ప్రజాసేవ చేస్తుంటారని, ఆయన ఆవిదంగా పనిచేస్తుంటే తాను పదవుల కోసం ప్రాకులాడుతానని ఎలా అనుకున్నారని ప్రశ్నించారు. తాను తన సోదరుడి నిజాయితీ, నిస్వార్ధ గుణాలను, అతని రాజకీయ ఎదుగుదలని చూసి చాలా గర్వపడుతున్నానని నాగబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ కోసం తన ప్రాణాలు పణంగా పెట్టేందుకు కూడా సిద్దమని నాగబాబు అన్నారు.
వైసీపీకి రాజకీయాలంటే ఓట్లు, సీట్లు, పదవులు, వాటి కోసం కుట్రలు మాత్రమే కావచ్చు. జగన్‌కి కుటుంబ బంధాలు, వాటి విలువ తెలిసి ఉండక పోవచ్చు. అధికారంలో లేనప్పుడు, ఉన్నప్పుడు కూడా ఆర్ధిక నేరారోపణలు ఎదుర్కొంటున్నా ‘నాకు శాలువా కప్పి సన్మానం ఎందుకు చేయలేదని’ అడిగే జగన్‌కు పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనబడుతుందన్నట్లు, అందరూ తనలాగే ఆలోచిస్తారని, అందరూ తనలాగే స్వార్ధం చూసుకుంటారని అనుకోవడం పొరపాటే కదా?